Category : 5th ఎస్టేట్

5th ఎస్టేట్

రుణాల రద్దులు దేనికి సంకేతం…?

Srinivas Manem
వారివి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు..! రూ. వేలకోట్ల ఆస్తి పరులు. కానీ బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను ఆర్బీఐ రద్దు చేసింది. దేశంలోని 50 మందికి చెందిన మొండి...
5th ఎస్టేట్

శ్రీకాకుళం కరోనా కథ – ఇంతింత కాదయా ..!

siddhu
  గత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలే ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్నాయి. వాటిని చూసి మిగతా జిల్లా ప్రజలు కూడా త్వరలోనే తాము కరోనా ని నియంత్రించి ఆ జాబితాలోకి వెళ్ళిపోదామని ఆశగా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో మొన్న నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. ఆ నాలుగు కేసులు కి కారణం ఒకడే. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు రాగా మిగిలిన వారికి కూడా అంటించాడు. తాజాగా ఇప్పుడు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కాగా ఇంతకుముందు వచ్చిన నాలుగు కేసులకు మరియు ఇప్పుడు వచ్చిన ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. దీనితో ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయింది. విషయం ఏమిటని ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా పి ఎస్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. లాక్ డౌన్ కన్నా ముందే ఇంటికి చేరుకున్న కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వ్యక్తులతో ట్రైన్ ప్రయాణం చేసి ఉండటం వల్ల ఇతనికి కరోనా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇతను అధికారులకు సమాచారం ఇచ్చి క్వారంటైన్ కు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఏదైనా చాలా అనూహ్యరీతిలో ఒక్కసారిగా ఈ జిల్లాలో ఐదు కేసులు రావడం ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా ఇప్పుడు నమోదైన తాజా కేసు శ్రీకాకుళం టౌన్ లో మొదటిది. ఇంతకుముందు నమోదైన 4 కేసులు పాతపట్నం ప్రాంతానికి చెందినవి. ప్రస్తుతం సదరు విద్యార్థి, టౌన్ లో ఏఏ ప్రాంతాల్లో తిరిగాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడు నివశిస్తున్న పీఎన్ కాలనీని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పోలీసులు-అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు....
5th ఎస్టేట్

పెద్దల కీ – పేదల కీ తేడా అదేనన్న మాట .. RBI చూపించిన చలన చిత్రం ! 

Siva Prasad
  ఆర్బీఐ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత దేశ ప్రజలకు ఒక మాంచి చలనచిత్రం చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో 68,607 కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను రైట్ ఆఫ్ చేసింది. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన టాప్-50 కి చెందిన జాబితా వారి మొత్తం మాత్రమే కావడం గమనార్హం. ఇది కూడా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన సమాచారం.   అయితే రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు చెబుతున్న కూడా సాంకేతికంగా రుణమాఫీ అన్నా.. పద్దుల మార్పిడి అన్నా… ఇక వారి దగ్గర నుండి బకాయిలను రాబట్టలేమని చెప్పి చేతులెత్తేయడం. ఎగవేతదారుల హామీగా పెట్టినా ఆస్తులన్నింటినీ వేలం వేశాక.. వీలైనన్ని మార్గాల్లో డబ్బులు వసూలు చేయగా ఇంకా బకాయిలు మిగిలితే చేసేది ఏమీ లేక వాటిని రైటాఫ్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇలా రైట్ ఆఫ్ పొందినవారిలో అత్యధికులు సమాజంలో ధనికులుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే. ఇక సామాన్యుల విషయానికి వద్దాం. లాక్ డౌన్ విధించింది ప్రభుత్వమే. అసలు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా కారణం కూడా ప్రభుత్వమే. ఎలాంటిది ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు నెలలు ఈఎంఐ కట్టలేము మొర్రో అని అంటే అది వాయిదా వేసుకునే ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ ఏదో పెద్ద మేలు చేసినట్లు పోజ్ కొట్టి చివరికి ఆ వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలిపేసి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సామాన్యులకు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టేంత సీన్ లేదు కదా. అదే బడా పారిశ్రామికవేత్తలు అయితే వీటిని మొండి బకాయిలుగా చేస్తారు. వాళ్లకు ఏమో ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం. ఇలా వాళ్లు వేలాది కోట్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే వారిని ఏమీ చేయలేక సామాన్యుల మీద పడి దోచేస్తుంటారు. చివరికి సామాన్యులను ట్యాక్సులు అడగడానికి మనసు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకీ అలా రుణాలు మాఫీ చేయించుకున్నవారి లిస్ట్ చూస్తే నీరవ్ మోడీ మామ మోహుల్ చొక్సీ, బాబా రామ్ దేవ్, విజయ్ మాల్యా, మన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రేపు లాక్ డౌన్ ముగిశాక తమ రుణాలు కట్టడానికి ఇబ్బంది పడే సామాన్యులు ఎవరు అంటే మన ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్న, వెంకట్రావు 20 సంవత్సరాల నుండి సొంత ఇంటి లోన్  కట్టుకుంటున్న రమేషు… వీరి చివర ఆటో నడుపుకునే సైదులు. ఇదీ మనందరం జీవిస్తున్న ఆధునిక జీవిత చలన చిత్రం....
5th ఎస్టేట్

తెలుగునాట రాజకీయం అంతే మరి .. సంచయిత కే అలవాటైంది అంటే అర్ధం చేసుకోండి 

Siva Prasad
మన తెలుగు రాష్ట్రంలో రాజకీయం ఒంటబట్టించుకోవడం అరటికాయ తిన్నంత సులువు. ఏం చదువుకున్నా.. ఎంతటి అనుభవం ఉన్నా.. ఏ పరిస్థితుల మధ్య పుట్టి పెరిగినా ఒక్కసారి పదవి చేతిలో పడింది అంటే చాలు రాజకీయం...
5th ఎస్టేట్

పరీక్ష పెరిగే… ఫలితం పెరిగే…!

Srinivas Manem
  ఏపీలో ఈ మధ్య కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును నిజమే…! తెలంగాణ లో ఈ మధ్య కరోనా కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అవును. నిజమే…! ఏపీలో కరోనా కేసుల నియంత్రణలో జగన్...
5th ఎస్టేట్

నిమ్మగడ్డ కేసు; కోర్టు వాదనల్లో కొత్త వివాదం…!

Srinivas Manem
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై కోర్టులో వాదనలు భిన్నంగా సాగుతున్నాయి. ఈరోజు ఏకంగా హైకోర్టు సీజే కి ఆగ్రహం వచ్చే ఘటన జరిగింది. దీనిలో కొత్త అనుమానాలు కూడా...
5th ఎస్టేట్

కరోనా కాటు – ప్రపంచానికి పాఠం

Siva Prasad
sample 7 వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది...
5th ఎస్టేట్

జగన్ మనసు మళ్ళీ మండలి వైపు ?

Siva Prasad
sample 6 ఈ మండలి వ్యవస్థ జగన్ కి అనేక తలనొప్పులు తీసుకొస్తుంది. పాపం మూడు రాజధానుల కథకి విరామం పడడానికి మండలి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డని సాగనంపాలన్న మళ్ళీ...
5th ఎస్టేట్

నష్టాల ఊబిలో ప్రభుత్వాలు – గట్టెక్కే దిక్కు ఇదే?

Siva Prasad
sample 5 కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులకు తాకిడి మించుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వరకు పర్వలేదు. కానీ ఇది కరోనా. అసలు ఆగే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ఆస్పత్రుల్లో సదుపాయాలు...
5th ఎస్టేట్

న్యూయార్క్ దారుణం వెనక ఊహించని నిజాలు

Siva Prasad
sample 4 పాపం అమెరికా…! ఆర్ధిక, సాంకేతిక, సైన్స్ రంగాలకు పెద్దన్న అమెరికా. అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అంటుంటారు. మరి ఇప్పుడు ఆ అగ్రరాజ్యం అల్లాడుతుంది. కరోనా ధాటికి కోలుకోలేక విలవిల్లాడుతుంది. ఏం...