Category : 5th ఎస్టేట్

5th ఎస్టేట్

కోతలు… తీతల ఈనాడు…!

Srinivas Manem
తెలుగు పత్రికా రంగంలో లో ఓ వెలుగు వెలిగిన ఈనాడు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమాని నెమ్మదిగా కిందకు  దిగుతోంది. కేవలం 40 రోజుల వ్యవధిలో భారీగా పడిపోయిన సర్క్యులేషన్ కాపాడుకోలేక.., నష్టాల్ని ఓర్చుకోలేక..,...
5th ఎస్టేట్

బాబు గారికి బీపీ తెప్పిస్తున్నా ‘ విజయవాడ ‘ రాజకీయం ..

siddhu
  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గత ఐదేళ్ల పాలనలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాకు ఆయన చేసింది చాలానే ఉంది. అన్ని జిల్లాల్లో మంత్రులను మార్చినప్పటికీ…. ఆ జిల్లా నుండి ఇద్దరికి ఇచ్చిన మంత్రి పదవులు మాత్రం ఆయన తన పాలనా కాలం మొత్తం కొనసాగించారు. అదీ కాకుండా కేబినెట్ లో కీలక పదవులైన డిప్యూటీ స్పీకర్ మరియు విప్ కూడా ఆ జిల్లాకు చెందిన నాయకులకే చంద్రబాబు కట్టబెట్టారు. ఇలా టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కృష్ణా జిల్లా నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అదే సమయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య చాలా వివాదాలు కూడా నడిచాయి. కానీ గత ఏడాది సీన్ రివర్స్ అయిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా నాయకులు ఏమన్నా బాసటగా నిలుస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉండే నాయకుడు అయితే కనీసం పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టి కొన్ని నెలలు అయిపోయింది. వీరిలో చాలామంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా మంత్రి దేవినేని అప్పట్లో వన్ మ్యాన్ షో కొనసాగించగా ఇప్పుడు మాత్రం ఏదో నామ్ కె వాస్తు వైసిపి పార్టీ పై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు తప్పించి పార్టీ ఎదుగుదలలో సమర్థవంతంగా అతని కృషి అయితే కనిపించడం లేదు. వీరందరి ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు కి ఎక్కడలేని బిపి వస్తుందని ఆ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అప్పట్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ టిడిపి బోర్డులో సభ్యుడిగా బాబు చాన్స్ ఇవ్వగా…. బుద్ధ వెంకన్న కు విప్ హోదాతో పాటు విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ గా నియమించగా.. బుద్ధ ప్రసాద్ కి డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ ఇచ్చారు. వీరిలో మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటివరకు ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చేయకపోగా.. కనీసం టిడిపి వాయిస్ కూడా బయటకు వినపడనివ్వని పరిస్థితి. ఇక బుద్ధ వెంకన్న, బోండా ఉమ మీడియాతో టచ్ లో ఉంటూ ఉన్న కూడా జిల్లాలోని పార్టీ నేతలందరినీ కలుపుకొనిపోయి ఒక శక్తిగా ఎదిగింది అయితే ఏమీ లేదు. ఇక గన్నవరం నుండి గెలిచిన వంశీ అయితే ఏకంగా పార్టీని వదిలి వెళ్ళిపోయాడు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. కరోనా నేపథ్యంలో ఆయన దీక్షకు దిగినా అది పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత వృథా కాగా.. పార్టీలో సీనియర్లను హైకమాండ్ వేధిస్తుండడంతో గమనార్హం....
5th ఎస్టేట్

కరోనా దారుణం: గౌరవప్రదమైన ‘చావు’ కోసం…

siddhu
  ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో హృదయ విచారకర సంఘటనలను చూడాల్సి వస్తోంది. డాక్టర్లు మరియు ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బారిన పడిన వారికి చికిత్స చేస్తూ ప్రాణాలు వదిలిన తీరు… హృదయాన్ని కలచి వేసే సంఘటనలు… ఎన్నో ఉన్నాయి. వీటి మధ్య లాక్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వలస జీవులు సుదూర ప్రాంతాలకు తన ప్రాణాలను లెక్కచేయకుండా కాలి బాట పట్టడం కూడా ఇప్పుడు మనం ఉన్న దయనీయమైన స్థితిని గుర్తు చేస్తోంది. చంకలో చంటిబిడ్డ…. నెత్తిన పాతాళానికి తొక్కేంత బరువు ఉన్న మూటలు వేసుకొని హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు రోడ్డు వెంబడి నడుస్తూ.. సైకిళ్లపై శ్రమిస్తూ వేలాది కిలోమీటర్ల ప్రయాణించడానికి వలస కార్మికులు పడుతున్న శ్రమ ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. ఒక పసి బిడ్డ అయితే అడవుల్లో పడి తన సొంత రాష్ట్రానికి వెళుతూ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఇంకొక వయసుమళ్ళిన వ్యక్తి అయితే కాలినడకన పొరుగున ఉన్న సొంత రాష్ట్రానికి తరలిపోతూ జాతీయ రహదారిపై విగత జీవిగా మారాడు. నిన్నటికి నిన్న చెన్నై నుండి శ్రీకాకుళం జిల్లా కు వెయ్యి కిలో మీటర్ల చొప్పున నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా సాహస యాత్ర చేసి గమ్యస్థానం చేరిన మత్స్యకారుల గురించి వింటే మనసు ద్రవిస్తుంది. నిద్ర లేదు…. ఆహారం లేదు ఎప్పుడెప్పుడు కబళించి వేద్దామా అన్నట్లు అల్పపీడనం వల్ల ఎగిసిపడుతున్న అలల మధ్య సొంత ఊరికి చేరడం వెనక ఒకచావు స్ఫూర్తి ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఊరు కాని ఊరిలో ఉండి ఆకలికి అలమటించి దిక్కులేని చావు చచ్చే కన్నా ఒంటి లో ఉన్న సత్తువ కు పరీక్ష పెట్టి స్వగ్రామానికి ఎలాగైనా తిరిగి వెళ్లి అక్కడ గౌరవప్రదమైన రీతిలో తనువు చాలిదాం అన్న వారి సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సొంత ఊరికి రావాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తే “బ్రతకడం కోసం ఎక్కడికో వచ్చాం.. కనీసం చావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడైనా సొంత నేలపైన చావకపోతే ఎలా” అని చెబుతుంటే వారు తమ నేలతల్లితో పాటుగా తన చావును కూడా సమానంగా ప్రేమించడం కనిపిస్తోంది. మహారాష్ట్రలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడి చనిపోయాడు కానీ మృతదేహాన్ని సొంత ఇంటికి చేర్చలేని దుస్థితి. బంధు మిత్రులకు ఒక చివరి చూపు దక్కే పరిస్థితి లేదు. ఈ ఉదంతం వారి కుటుంబ సభ్యులను జీవితాంతం వెంటాడుతుంది .అలాగే ఇటీవల నెల్లూరుకు చెందిన డాక్టర్ కరోనా కారణంగా చెన్నైలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది పేషెంట్లకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన అతనిని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఒక అనాధ శవంలా అంత్యక్రియలు జరిపి స్మశానానికి తరలించిన తీరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఇన్నేళ్లు వైద్య సేవ చేసి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించిన అతను చివరికి నా అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా చివరి ప్రయాణం చేయడం ఎంతవరకు సమంజసం?...
5th ఎస్టేట్

కిమ్ వచ్చేసారహో…!

Srinivas Manem
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ యాన్ వచ్చేసారు. ఆ దేశ మీడియాకి కనిపించారు. స్వయంగా ఆ దేశ మీడియా ఈరోజు వెల్లడించింది. కిమ్ కి ఏమైంది? కనిపించడం ఏంటి? అనుకుంటున్నారేమో…! ప్రత్యర్థులకు హెచ్చరికలు..,...
5th ఎస్టేట్

కుప్పం నుంచి కుప్పలు కుప్పలు గా లెక్కలు బయటకొస్తున్నాయ్ ?  

siddhu
  రాష్ట్ర రాజకీయాలలో కుప్పం నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన అక్కడ ఆయన ఇప్పటివరకు ఓడింది లేదు. అయితే ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడం…. వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని గట్టిగా టార్గెట్ చేసి దానిని పురపాలక సంఘంగా మార్చడం త్వరత్వరగా జరిగిపోయాయి. కుప్పం పురపాలక సంఘంగా చంద్రబాబు హయాంలోనే మారకపోగా.. కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పడు ఉన్న ప్రభుత్వ పనితీరుపై ఫుల్ గా హ్యాపీ అయిపోయారు. తొలిమెట్టు విజయవంతంగా వేసిన జగన్ ఇప్పుడు తర్వాత అసలైన వ్యవహారంలోకి వచ్చాడు. సొంత నియోజకవర్గపు వ్యవహారాల్లో బాబు గురించి ఏదైనా గుట్టు బయటపడుతుందేమో అని విపరీతంగా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఎంతైనా చంద్రబాబు తెలివి మెచ్చుకోవాలి. ఎక్కడా దొరకడు…. ఫైళ్లను ఉండడు అందుకే అప్పట్లో వైఎస్ కు చిక్కలేదు జగన్ కు తొమ్మిది నెలల నుండి విపరీతంగా ప్రయత్నిస్తున్నా దొరకట్లేదు.  ఇక జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబుని వీలైనన్ని కేసులు బుక్ చేసి బీటలు వారిన తెలుగుదేశం స్థంబాలను కూల్చేయాలని మంచి కసి మీద ఉన్నాడు. దీనిలో భాగంగా జరిగిన అనేక తవ్వకాల్లో కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అయితే బాబు గారు ఏమైనా సామాన్యుడా…? డైరెక్ట్ గా అతను ఎందులో తలదూర్చడన్న విషయం కొంచెం లోతుగా వెళితే తెలిసింది. అయితే ఏమి ఎన్నో ఏళ్లుగా కుప్పంలో చంద్రబాబు తరఫున అతని అన్ని వ్యవహారాలను చూసుకునే అతని పర్సనల్ అసిస్టెంట్ అనగా పిఎ మనోహర్ ఇరుక్కున్నాడు. ఒక్క మనోహర్ మాత్రమే కాదు బాబు కి సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్న అందరినీ టార్గెట్ చేసి ఒక్కసారిగా కుప్పం కుప్పలో నుంచి బయటికి లాగారు. టౌన్ బ్యాంకు లో దాదాపు రెండు కోట్ల వరకు స్కామ్ జరిగిందని లెక్కలు వేశారు. ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి…. అసలు దాని కథాకమామిషు ఏంటో తేలుస్తున్నారు. వీటిలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనోహర్ ఇందులో బుక్ కావడం బాబు కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి, చిటారుకొమ్మన అందుకోవాలంటే కష్టపడి చెట్టు ఎక్కాల్సిన పని లేదు అన్న విషయం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి బోధ పడినట్లు ఉంది. ఇక ఈ స్కామ్ విషయమై ప్రస్తుత బ్యాంకు చైర్మన్ ఫిర్యాదు చేయడం మరొక విశేషం. దీనితో పోలీసులు కేసు బుక్ చేసి చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఇక త్వరలోనే స్కామ్ పై పూర్తి వివరాలు బయట పడతాయి కానీ ప్రాథమికంగా బయటకు వచ్చిన ఒక అభియోగం మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఏమిటంటే ప్రత్యేకంగా ఆడిటింగ్ మరియు జువెలరీ పరిశీలన జరిగినప్పుడు 30 బంగారు ప్యాకెట్లు కనిపించలేదట. ఇది ఏంటి రా బాబు అని ఆరాతీస్తే మేనేజర్ నవీన్ బాబు మరియు క్యాషియర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు బంగారం మాయం కావడం ఏమిటి? ఈ వ్యవహారం అంతా పక్కనపెడితే మరొక ఒక 20 లక్షల 25 వేలు లెక్క తేలడం లేదు. ఇదేమిటని మేనేజర్ ను ప్రశ్నిస్తే.. 2015లో శ్రీనివాసులు తీసుకొని పోయాడు…. ఆయన మనోహర్ మనిషి అంటాడు. ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి యొక్క 16 బాండ్లను కుదువపెట్టి డబ్బు తీసుకొని పోయాడు అని అన్నాడట. అసలు గుడి ఏమిటి? గుడి బాండ్లు కుదువపెడితే డబ్బులు ఎలా ఇస్తారు? దీనికి చంద్రబాబు పిఏ రికమండేషన్ ఏమిటి? ఇప్పుడు వైసిపి కింకర్తవ్యం చంద్రబాబు పిఎ మనోహర్ ను లాక్ చేయడం. ఇక అతను అప్రూవర్ గా మారాలేకాని కుప్పంలో చంద్రబాబు లింక్స్ కత్తిరించడం వైసీపీకి పెద్ద పనేం కాదు. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది....
5th ఎస్టేట్

జనసేనకి  ‘ఆక్సిజన్’ అందడం లేదు… పార్టీ లో బ్లేమ్ గేమ్ షురూ ?

siddhu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని గా మారినప్పటి నుండి అతనికి భయంకరమైన కష్టాలు మొదలయ్యాయి. ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో కానీ అతను నడుస్తున్న దారి అంతా గతుకుల మయం అయిపోయింది. ఎన్నికలలో...
5th ఎస్టేట్

దేశం క్షేమమా..? క్షామమా…?

Srinivas Manem
దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితులు ఎటు వైపు మళ్లుతున్నాయి..? కరోనా వ్యాప్తి పెరిగితే దేశం లో ఆకలి చావులు వస్తాయా …? కరోనా నేపథ్యంలో మన దేశం క్షేమమేనా…? క్షామం వైపు వెళ్తున్నామా..?...
5th ఎస్టేట్

రుణాల రద్దులు దేనికి సంకేతం…?

Srinivas Manem
వారివి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు..! రూ. వేలకోట్ల ఆస్తి పరులు. కానీ బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను ఆర్బీఐ రద్దు చేసింది. దేశంలోని 50 మందికి చెందిన మొండి...
5th ఎస్టేట్

శ్రీకాకుళం కరోనా కథ – ఇంతింత కాదయా ..!

siddhu
  గత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలే ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్నాయి. వాటిని చూసి మిగతా జిల్లా ప్రజలు కూడా త్వరలోనే తాము కరోనా ని నియంత్రించి ఆ జాబితాలోకి వెళ్ళిపోదామని ఆశగా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో మొన్న నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. ఆ నాలుగు కేసులు కి కారణం ఒకడే. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు రాగా మిగిలిన వారికి కూడా అంటించాడు. తాజాగా ఇప్పుడు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కాగా ఇంతకుముందు వచ్చిన నాలుగు కేసులకు మరియు ఇప్పుడు వచ్చిన ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. దీనితో ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయింది. విషయం ఏమిటని ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా పి ఎస్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. లాక్ డౌన్ కన్నా ముందే ఇంటికి చేరుకున్న కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వ్యక్తులతో ట్రైన్ ప్రయాణం చేసి ఉండటం వల్ల ఇతనికి కరోనా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇతను అధికారులకు సమాచారం ఇచ్చి క్వారంటైన్ కు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఏదైనా చాలా అనూహ్యరీతిలో ఒక్కసారిగా ఈ జిల్లాలో ఐదు కేసులు రావడం ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా ఇప్పుడు నమోదైన తాజా కేసు శ్రీకాకుళం టౌన్ లో మొదటిది. ఇంతకుముందు నమోదైన 4 కేసులు పాతపట్నం ప్రాంతానికి చెందినవి. ప్రస్తుతం సదరు విద్యార్థి, టౌన్ లో ఏఏ ప్రాంతాల్లో తిరిగాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడు నివశిస్తున్న పీఎన్ కాలనీని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పోలీసులు-అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు....
5th ఎస్టేట్

పెద్దల కీ – పేదల కీ తేడా అదేనన్న మాట .. RBI చూపించిన చలన చిత్రం ! 

Siva Prasad
  ఆర్బీఐ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత దేశ ప్రజలకు ఒక మాంచి చలనచిత్రం చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో 68,607 కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను రైట్ ఆఫ్ చేసింది. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన టాప్-50 కి చెందిన జాబితా వారి మొత్తం మాత్రమే కావడం గమనార్హం. ఇది కూడా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన సమాచారం.   అయితే రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు చెబుతున్న కూడా సాంకేతికంగా రుణమాఫీ అన్నా.. పద్దుల మార్పిడి అన్నా… ఇక వారి దగ్గర నుండి బకాయిలను రాబట్టలేమని చెప్పి చేతులెత్తేయడం. ఎగవేతదారుల హామీగా పెట్టినా ఆస్తులన్నింటినీ వేలం వేశాక.. వీలైనన్ని మార్గాల్లో డబ్బులు వసూలు చేయగా ఇంకా బకాయిలు మిగిలితే చేసేది ఏమీ లేక వాటిని రైటాఫ్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇలా రైట్ ఆఫ్ పొందినవారిలో అత్యధికులు సమాజంలో ధనికులుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే. ఇక సామాన్యుల విషయానికి వద్దాం. లాక్ డౌన్ విధించింది ప్రభుత్వమే. అసలు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా కారణం కూడా ప్రభుత్వమే. ఎలాంటిది ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు నెలలు ఈఎంఐ కట్టలేము మొర్రో అని అంటే అది వాయిదా వేసుకునే ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ ఏదో పెద్ద మేలు చేసినట్లు పోజ్ కొట్టి చివరికి ఆ వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలిపేసి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సామాన్యులకు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టేంత సీన్ లేదు కదా. అదే బడా పారిశ్రామికవేత్తలు అయితే వీటిని మొండి బకాయిలుగా చేస్తారు. వాళ్లకు ఏమో ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం. ఇలా వాళ్లు వేలాది కోట్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే వారిని ఏమీ చేయలేక సామాన్యుల మీద పడి దోచేస్తుంటారు. చివరికి సామాన్యులను ట్యాక్సులు అడగడానికి మనసు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకీ అలా రుణాలు మాఫీ చేయించుకున్నవారి లిస్ట్ చూస్తే నీరవ్ మోడీ మామ మోహుల్ చొక్సీ, బాబా రామ్ దేవ్, విజయ్ మాల్యా, మన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రేపు లాక్ డౌన్ ముగిశాక తమ రుణాలు కట్టడానికి ఇబ్బంది పడే సామాన్యులు ఎవరు అంటే మన ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్న, వెంకట్రావు 20 సంవత్సరాల నుండి సొంత ఇంటి లోన్  కట్టుకుంటున్న రమేషు… వీరి చివర ఆటో నడుపుకునే సైదులు. ఇదీ మనందరం జీవిస్తున్న ఆధునిక జీవిత చలన చిత్రం....