తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నుంచి తెలంగాణను, ఆ రాష్ట్ర ప్రజలనూ దేవుడే కాపాడాడని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు తెరాస అధినేత...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ముహూర్తాలను బలంగా నమ్మే కేసీఆర్ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంచి మూహుర్తం కోసం పండితులతో...
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరు అధికారం చేపడతారన్న సస్పెన్స్ కు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో నిలిచిన నేపథ్యంలో అధికారం...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండో రోజు మరికొద్ది సేపటిలో ప్రారంభమౌతాయి. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ రూల్ 267 కింద రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందంటూ ఈ విషయంలో తక్షణమే చర్య చేపట్టాలని ఇచ్చిన నోటీసుపై...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో హస్తానిదే పై చేయి అయ్యింది. అయితే అధికారం చేపట్టడానికి అసవరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది....
తెలంగాణ ఫలితం కాంగ్రెస్-టీడీపీల పొత్తుకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాతీర్పుగా వైకాపా అధినేత జగన్ అభివర్ణించారు. అవాస్తవాలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలంటే సాధ్యపడదని, ప్రజలు అటువంటి నేతలకు బుద్ధి చెబుతారని జగన్ అన్నారు....
ఆర్బీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పుపై రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజు నోటీసు ఇచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలకు వాటిల్లుతున్న ముప్పుపై రూల్ నంబర్ 276 కింద తక్షణమే చర్చ చేపట్టాలని నోటీసు ఇచ్చింది....
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్ట్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో హస్తవాసి బాగుంది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఏపీపై ఏమేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతున్నది. తెలంగాణలో కూటమి ఘోర పరాజయం ఏపీలో వైకాపా, జనసేన శ్రేణుల్లోనే కాకుండా బీజేపీ శ్రేణుల్లో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. హోరాహోరీ పోరు జరిగిందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. మొత్తం 119 స్థనాలకు గాను తెరాస 87 స్థానాలలో విజయం సాధించింది....
ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ రాజీనామా చేశారు. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు...
కేసీఆర్ కు బీజేపీ, బీఎల్ఎఫ్ లు నెత్తిన పాలుపోశాయని చెప్పాలి. కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని భావించారు. అయితే...
ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుందనే చెప్పాలి. ఈ మూడు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా రెండు రాష్ట్రాలలె అధికారం హస్తగతం చేసుకునే...
అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటారని భావించిన కాంగ్రెస్ నేతలంతా కారు జోరు ముందు పరాజయం పాలయ్యారు. జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సీఎం...
మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఎంఎన్ఎఫ్ హవా కొనసాగుతున్నది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఎమ్ఎన్ఎప్ 29 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూపుతుందనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ ఫలితం ఏపీలో ప్రధాన విపక్షం వైకాపాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు దిమ్మతిరిగేలా చేశాయి. దశాబ్దాల విభేదాలను పక్కన పెట్టి తెరాస ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలోకి...
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక్యతలో కొనసాగున్నది. ఈ మూడు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ వెనుకబడింది. రాజస్థాన్ లో 199 స్థానాలకు గాను ఇప్పటి వరకూ...
ఇప్పటి వరకూ ఎన్నికల సర్వేల విషయంలో లగడపాటి సర్వేలకు ఒక విశ్వసనీయత ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన సర్వే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్లు చిలక జోస్యం స్థాయికి పడిపోయింది....
హోరాహోరీగా జరిగిందన్న అంచనాలు తల్లకిందులైపోయాయి. ఇక్కడ వార్ వన్ సైడ్ గా మారిపోయిందని ఫలితాల సరళి తేటతెల్లం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వా నేనాగా ప్రజాకూటమి- టీఆర్ఎస్ మధ్య జరిగిందన్న అంచనాలు...
తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. హరీష్ రావు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నది. హరీష్ రావుమూడో రౌండ్ పూర్తయ్యే సరికి 19 వేలకు పైగా ఆధిక్యత సాధించింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి...
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గద్వాల నియోజకవర్గంలో మాజీ మంత్రి డీకే ఆరుణ వెనుకబడ్డారు. అలాగే తాండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. అలాగే కొల్లాపూర్...
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. సిద్దిపేటలో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకు 6వేలకు పైగా ఓట్ల ఆధిక్యత లభించింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతను బట్టి కాంగ్రెస్ 2,...
రాజస్థాన్ లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ హస్తం హవా కనిపిస్తున్నది. టోంక్ నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అలాగే తన నియోజకర్గంలో రాజస్థాన్ సీఎం, బీజేపీ అభ్యర్థి వసుంధరరాజే ఆధిక్యత...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన పావు గంటలో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో తొలి ఆధిక్య్తలు వెలువడ్డాయి. నాలుగు చోట్లా కూడా కాంగ్రెస్...
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 7న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మొత్తం 43 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల ఉన్నాయి. ప్రజాకూటమి,...
సరిగ్గా పార్లమెంటు సీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇది కచ్చితంగా కొత్త తలనోప్పులను తెచ్చిపెడుతుంది. ఆర్బీఐ...
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపటిలో వెలువడనున్నాయి. మధ్యాహ్నానికి ఏ రాష్ట్రంలో సరళి ఏ పార్టీకి అనుకూలంగా...
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 10 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే నెల10లోగా రాష్ట్రంలో...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సెన్సెక్స్ 660 పాయింట్ల నష్టాలలో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా...
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో ఈ భేటీ జరగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతర పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు...
కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు అయిన ఉపేంద్ర కుష్వాహ గత కొంత కాలంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పట్ల అసంతృప్తిగా...
హస్తిన వేదికగా నేడు జరగనున్న బీజేపీయేతర పార్టీల నేతల భేటీకి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ హాజరు కావడం లేదు. ఈ విషయం స్వయంగా ఆయనే కొద్ది సేపటి కిందట తెలిపారు....
జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సమావేశం కోసం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని చేరుకున్నారు. చంద్రబాబు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు...
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. పలు విమర్శలు ఎదుర్కొని, కోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరించి అంతా సరి చేశాశమంటూ అసెంబ్లీ...
హ్యాపీ నెస్ట్ ప్లాట్ల బుకింగ్ కు అనూహ్య స్పందన లభించింది. రెండో దశ ఆన్ లైన్ ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనూ పూర్తయ్యింది. 9 టవర్లలోని 900 ప్లాట్ల బుకింగ్ ప్రక్రియ సీఆర్డీయే ఆధ్వరంలో...
అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 31 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి సీరీస్...
మహాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్ తో ఈ రోజు భేటీ కానున్నారు. తామంతా ఎన్నికలకు ముందుగానే పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేశామనీ, కనుక ప్రజాకూటమి సీట్లను ఒకటిగానే గుర్తించాలని వారు గవర్నర్ ను...
హస్తిన వేదికగా కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ రోజు జరిగే బీజేపీయేతర పార్టీల కీలక భేటీ జరగనుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుపై ఈ...
ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే భారత్ మరో నాలుగు వికెట్లు తీయాలి. అదే ఆస్ట్రిలియా అయితే విజయానికి ఇంకా 137 పరుగులు చేయాలి....
భారత్ -ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఈ రోజు ఆట నాలుగో రోజు కడపటి వార్తలందే సరికి...
తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే వెలువడింది. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను తాజాగా హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ వెలువరించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ 35 స్థానాలలో...
మిస్ వరల్డ్-2018 కిరీటం మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీలియోన్ కు దక్కింది. చైనాలోని సన్యా సిటీలో నిన్న రాత్రి జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పోన్స్ విజేతగా నిలవగా రన్నరప్ గా థాయ్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్ నమ్మవద్దని ఇండియా టుడే ఎడిటర్ స్వయంగా చెప్పారట. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో ప్రధాని మోదీని మించిపోయారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికీ నంబర్ వన్. అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీ...
ఇటలీలోని ఒక నైట్ క్లబ్ లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటలీ తూర్పు తీరంలోని అంకోనాలోని కొరినాల్డో పట్టణంలోని లాంటెర్నా అజ్జుర్రా అనే నైట్ ఒక నైట్ క్లబ్...
తనపై జరిగిన దాడి వెనుక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. పోలింగ్ కు ముందు రోజు తనపై దాడి జరిగిందనీ, తాను హైదరాబాద్ నుంచి...
ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. ఆట మూడో రోజు ముగిసే సరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది....
కేంద్రంలోని మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయ ప్రయోజనం కోసం పెద్దగా ప్రచారం చేసుకున్నది. ఈ విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. రెండేళ్ల కిందట జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను...