సినిమా

ఆడపిల్లల కోసం అడుగుతున్నా

Share


హీరోయిన్ ప్రియ‌మ‌ణి సామాజిక సేవ‌లో భాగంగా త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. హెబిటేట్ ఫ‌ర్ హ్యుమానిటీ ఇండియా అనే స్వ‌చ్చంద సంస్థ భార‌త‌దేశంలో ఆడ‌పిల్ల‌లు పాఠ‌శాల‌ల‌కు వెళ్లి చ‌దువుకోవ‌డానికి టాయ్‌లెట్స్ క‌ట్టించి ఇస్తోంది. ఈ సంస్థ‌కు కావాల్సిన ఆర్ధిక వ‌న‌రులను స‌మ‌కూర్చ‌డానికి న‌టి ప్రియ‌మ‌ణి ముందుకు వ‌చ్చారు. ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సంస్థ‌తో క‌లిసి బెంగ‌ళూరు ఏప్రిల్ 19న మార‌థాన్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా, ఎవ‌రైనా సంస్థ‌కు నేరుగా ఆర్ధిక సాయం చేయాల‌నుకుంటే ఆన్ లైన్‌లో పే చేసేలా ఏర్పాటు చేశారు.
ప్రియ‌మ‌ణి వ్య‌క్తిగ‌తంగా త‌న ట్విట్ట‌ర్‌లో ఫండ్ రైజింగ్ కోసం ఓ వీడియో పోస్ట్ చేశారు. “చాలా మంది అమ్మాయిలు స్కూల్స్‌లో టాయ్‌లెట్స్ లేని కార‌ణంగా చ‌దువుకోవ‌డానికి వెళ్ల‌డం లేదు. అటువంటి వారి కోసం హెబిటేట్ ఫ‌ర్ హ్యుమానిటీ ఇండియా సంస్థ టాయ్‌లెట్స్‌ను నిర్మించి ఇస్తోంది. వీరికి మ‌న వంతుగా ఆర్ధిక సాయం చేద్దాం. క్రింద పేర్కొన్న లింక్ ద్వారా మీకు రూ.50..100 ఇలా ఎంత తోస్తే అంత మొత్తాన్ని సాయం చేయండి. అమ్మాయిల చ‌దువు కోసం మీ వంతుగా స‌హ‌కారం అందించండి“ అని తెలిపారు ప్రియ‌మ‌ణి.

 


Share

Related posts

ఇదీ ఒకరకమైన పబ్లిసిటీనా ..?

GRK

Icon : ఐకాన్ స్క్రిప్ట్ లో మార్పులు..పాన్ రేంజ్ లో ప్లాన్

GRK

Puri jagannath : ప్రభుదేవా ని రంగంలోకి దింపిన డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

sekhar

Leave a Comment