సినిమా

ఆ యువకుడితో స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్.. బహిరంగంగా ప్రకటించిందిగా!

Share

 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఉహించిన ఫలితాని ఇవ్వలేకపోయింది. లాల్ సింగ్ చద్దా సినిమా వల్ల నష్టపోయిన బయ్యార్లకి వీలయినంతవరకు నష్ట పరిహారాన్ని ఆమిర్ ఖాన్ అందించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్, అమిర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ప్రేమలో పడింది. ఈ స్టార్ కిడ్ ఆ ఫిట్‌నెస్ ట్రైనర్‌తో లవ్ అఫైర్ పెట్టుకుందని.. వారిద్దరూ డేటింగ్‌లో వున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా చాలా రోజుల నుంచే వార్తలు రాస్తోంది. అయితే తాజాగా స్వయంగా ఐరాఖానే తన లవ్‌లో ఉన్నట్టు చెబుతూ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చింది.

#image_title

ఐరా ఖాన్ ప్రేమించిన ఫిట్‌నెస్ ట్రైనర్ పేరు నుపూర్. అతను సైక్లింగ్ పోటీల కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు ఐరా కూడా అతనితో కలిసి వెళ్ళింది. అక్కడ సైక్లింగ్ పోటీలు పూర్తవ్వగానే నుపూర్ వచ్చి ఐరాని హాగ్ చేసుకొని మోకాళ్ళపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఐరా వెంటనే ఎస్ చెప్పి అక్కడే నుపూర్‌తో ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకుని తన ప్రేమని వ్యక్తపరిచింది. అనంతరం ఈ ప్రేమను ప్రపంచానికి బహిర్గతం చేసింది. తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ క్యూట్ మూమెంట్ చూసిన బాలీవుడ్ సెలెబ్రేటీలందరూ ఐరాకి సోషల్ మీడియాని వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

#image_title

నిజానికి ఈ ఇద్దరు ప్రేమ జంటల కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి. సైరా ఖాన్ తనకు తానుగా నుపూర్‌తో పెళ్లి చేసుకునేంత స్ట్రాంగ్ ఒక రిలేషన్ షిప్ ఉందనే విషయాన్ని తెలపలేదు. కానీ ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని.. ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఓపెన్ గా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.


Share

Related posts

షాకిస్తున్న సంజయ్ దత్ కొత్త లుక్… ఇక నిర్మాతల పని అంతే?

sowmya

Neha Malik Cute Stills

Gallery Desk

రామ్ ” రెడ్ ” రిజల్ట్ తేడా కొడితే ఆ ఇద్దరి కెరీర్ ఇక అంతే ..?

GRK