సినిమా

క‌న్నీళ్లు పెట్టుకున్న విద్యాబాల‌న్‌

Share

 

బాడీ షేమింగ్‌(శ‌రీరాకృతిని హేళ‌న చేయ‌డం) అనే బాధ‌ను సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం అనుభ‌వించారు. ఇంకా అలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఫేస్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా స‌మీరా రెడ్డిపై కూడా ఇలాంటి చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్న‌వారే. వీరిలో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ కూడా ఉన్నారు. ఈమె త‌న శ‌రీరాకృతిని తానే అస‌హ్యించుకునేదాన్ని అని చాలా సార్లు తెలియ‌జేశారు. అయితే ఆమె ఈ స‌మ‌స్య‌ను అవ‌మానాల రూపంలో ఎదుర్కొంటున్న కొంత మంది కోసం ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. రేడియో స్టేష‌న్ బిగ్ ఎఫ్‌.ఎంవారు నిర్వ‌హించే `ధున్ బ‌ద‌ల్ కే దేఖో` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాడీ షేమింగ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న యువ‌తీ యువ‌కులు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. అందులో భాగంగా బిగ్ ఎఫ్‌.ఎం ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియో బాడీ షేమింగ్ గురించి ప్ర‌స్తావించారు. వీడియోలో శ‌రీరాకృతిని చూసి హేళ‌న చేయ‌కండి అంటూ పాట పాడుతూ విద్యాబాల‌న్ క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

 


Share

Related posts

సల్మాన్ సినిమా ఎందుకు ఒప్పుకుందో బయట పెట్టిన పూజా హెగ్డే ..!

GRK

మ‌హేశ్ ఫ్యాన్స్‌కి జల‌క్‌!

Siva Prasad

బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ..వీళ్ళంతా కాదు ఈ సారి సంక్రాంతి బరిలో దుగుతున్న మొనగాడెవరో తెలుసా..?

GRK

Leave a Comment