బాబాయ్ తో జరభద్రం…

Share

ఎన్టీఆర్ బయోపిక్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా…తెలుగు జాతికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఇందులో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కోసం నందమూరి కుటుంబంలోని అందరూ రావడం అక్కడున్నవారికి చాలా ఆనందం కలిగించే సందర్భం. నారా బ్రాహ్మణి సహా నందమూరి కుటుంబంలోని పెద్దలు, పిల్లలు అందరూ వచ్చారు. ఈ వేడుకలో అందరికంటే… జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ప్రసంగం అందరినీ మెప్పించింది. ఎంతో భావోద్వేగంతో, హృదయపూర్వకంగా మాట్లాడడంతో, సోషల్ మీడియా అంతటా తారక్ ప్రసంగం గురించే చర్చ నడుస్తోంది.

ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా తారక్, బాబాయ్ బాలయ్య గురించి మాట్లాడేటపుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. బాబాయ్ మీద తనకున్న ప్రేమ గురించి చెబుతూ… భావోద్వేగంతో మాట్లాడాడు. ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించినందుకు బాబాయ్ గురించి స్పెషల్‌గా ప్రస్తావిస్తూ…మా పిల్లలు అడిగితే ఒక మాట చెబుతాను…” మా తాత గురించి మీ తాత తీసిన సినిమా ఒకటి ఉందని చెబుతాను ” అంటూ చెప్పాడు. ఆ మహానుభావుడి చరిత్రను అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది బాబాయ్. మీ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తాతయ్య అంటూ తిరిగేవాడిని…ఆయన గురించి తెలిశాక రామారావు గారు, అన్నగారు అంటూ పిలిచేవాడినని అన్నాడు. ఆయన ఎన్నో సినిమాలు చూశాను. బాబాయ్‌లో ఆ పెద్దాయన్నే చూసుకుంటున్నా అంటూ ఉద్వేగంగా చెప్పాడు. ఇపుడు సోషల్ మీడియాలో ఈ అంశమే ఎక్కువ చర్చకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా కలవడానికి దూరంగా ఉన్న తారక్, ఈ ఈవెంట్ వల్లనైనా అందరూ వచ్చినందుకే తారక్ ఇంత ఎమోషనల్ అయ్యాడని అనుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్-బాలయ్య చాలా సరదాగా ఉండడంతో ఫ్యాన్స్ అంతా చాలా సంతోషించి ఉంటారు కానీ కొంతమంది మాత్రం బాబాయి-అబ్బాయి కలయిక నచ్చట్లేదు. కోపానికి, నిలకడలేమి తనానికి పరాకాష్ఠ అయిన బాలకృష్ణ, అది సినిమా కోసమో, వచ్చే ఎన్నికల కోసమో, లేక హరికృష్ణ లేడు కాబట్టి ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలనుకుంటున్నాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య బాగానే ఉన్నాడు కానీ బాలకృష్ణ ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండడు. ఇది ఎంత నిజమో ఏదైనా జరిగితే ఎన్నికల తర్వాతో, లేక మరేదైనా సందర్భం వస్తేనో ఎన్టీఆర్ ని పక్కన పెట్టడానికి బాలకృష్ణ క్షణం ఆలోచించడు అనేది కూడా అంతే నిజం. ఒకవేళ వచ్చే ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రాకపోతే, బాబాయ్-అబ్బాయిల మధ్య చాలా దూరం పెరిగే అవకాశం ఉంది. ఇది ముందుగానే గుర్తించి ఎన్టీఆర్, బాలకృష్ణకి కొంచెం దూరంగానే ఉండాలని కొందరు నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు బాబాయ్-అబ్బాయి మధ్య ఉన్న ఈ సత్సంబంధాలు సినిమాలు, రాజకీయాలకి అతీతంగా ఉంటుందేమో చూడాలి.


Share

Related posts

Rashmi Gautam Gorgeous Pics

Gallery Desk

`విజిల్‌`పై ఫిర్యాదు

Siva Prasad

“మహానటి” కి సాటెవ్వరూ ..!

GRK

Leave a Comment