తమిళ్ స్టార్ తలపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా అంటే చాలు అభిమానులు థియేటర్ దగ్గర బారులు తీరాల్సిందే. ఇప్పటికే విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. కరోనా కారణంగా 2021 సంక్రాంతికి వాయిదా పడింది. తాజాగా ‘తలపతి 65’ చిత్రం దర్శకుడు ఎవరు అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మాస్టర్ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి నటించనున్న చిత్రం ‘తలపతి 65’. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హీరోయిన్ గా అందాల నటి నయనతార నటించబోతున్నారు. సంగీత దర్శకుడుగా అనిరుద్ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
నెల్సన్ ఇప్పటికే కామెడీ థ్రిల్లర్ ‘కోలమవు కోకిల’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా నెల్సన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలవనుందని యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెలిపారు.
మాస్టర్ ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా థియేటర్ల మూసివేయటంతో వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా థియేటర్లు తెరిచిన కరోనా కారణంగా జనాలు థియేటర్ కి ఎక్కువ రాకపోవొచ్చని సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు సినీ నిర్మాతలు. ఈ సినిమాపై అంచనాలు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అనే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మోగించిన విషయం తెలిసిందే. విజయాలతో దూసుకుపోతున్నా విజయ్ తదుపరి చిత్రం కూడా విజయం సాదించాలని అబిమానులు ఆశిస్తున్నారు. చూడాలి ఈ చిత్రం ఎంత మేరకు విజయం సాధిస్తోంది అనేది.