మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్లో స్టార్ హీరోయిన్గా ఎదిగే క్రమంలో పేరుతో పాటు పలు రకాల రూమర్స్‌ను ఎదుర్కొంది. కార్తితో తమన్నా రిలేషన్ షిప్లో ఉందని వార్తలు వచ్చాయి. అలాగే 2012లో ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఓ యాడ్‌లో నటించింది. అప్పుడు విరాట్‌తో తమన్నా డేటింగ్లో ఉందని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఇటు విరాట్ కానీ.. అటు తమన్నా కానీ పట్టించుకోలేదు. తర్వాత విరాట్ అనుష్క శర్మతో ప్రేమలో పడటం.. ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. తమన్నా.. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా స్థాయిని పెంచుకుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో విరాట్‌తో డేటింగ్ చేసిన దాని గురించి ప్రశ్నిస్తే..నేను, విరాట్ ప్రొఫెసనల్గానే మాట్లాడుకునేవాళ్లం. ఆ యాడ్ తర్వాత తనను కనీసం కలవనే లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి`లో టైటిల్ పాత్రలో నటిస్తుంది.
previous post