“లైగర్” సినిమా చూడొద్దని..#Boycott Liger Movie అనే హ్యష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు, హీరోయిన్ అనన్య పాండే డ్రగ్స్ అడిక్ట్ అయినా అమ్మాయి అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. “లైగర్” నీ చూడకుండా బహిష్కరించాలి అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరొక పక్క విజయ్ దేవరకొండ అభిమానులు #UnstoppableLiger అనే హ్యష్ ట్యాగ్ తో.. రచ్చ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ విషయంపై హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ట్విట్టర్ లో రియాక్ట్ కావడం జరిగింది.
“మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు, ఎవరి మాట వినేది లేదు. కొట్లాడుదాం” అని ట్వీట్ చేయడం జరిగింది. “లైగర్” పాన్ ఇండియా మూవీ అని అందరికీ తెలుసు. ఈ సినిమాకి ఇండియా వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా భారీ ఎత్తున అభిమానులు రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా వరకు పాజిటివ్ వైబ్ “లైగర్”కి అన్నిచోట్ల వస్తోంది. వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ ఈ సినిమాతో మళ్లీ కం బ్యాక్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండ హెటర్స్ “లైగర్” విషయంలో భారీ ఎత్తున నెగటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరో ఐదు రోజుల్లో “లైగర్” విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించడం విశేషం.