ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ ఉధృతంగా నడుస్తున్నాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోది బయోపిక్ `పిఎం నరేంద్ర మోది`. `దేశభక్తే నా శక్తి` అనేది ఉపశీర్షిక. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రక్తచరిత్ర, వినయవిధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వివేక్ ఒబెరాయ్ ఇందులో నరేంద్రమోది పాత్రధారిగా నటిస్తున్నారు. ఆయన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త నుండి దేశ ప్రధానిగా ఎదిగిన క్రమంలో వివిధ దశలకు చెందిన ఫోటోలు కూడా నెటింట్లో వైరల్ అయ్యాయి. ఓమంగ్ కుమార్ దర్శకుడు. సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్.సింగ్ నిర్మాతలు. 23 దేశీయ భాషల్లో సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఎన్నికలు దృష్ట్యా సినిమా విడుదలను వారం రోజులు ముందుగానే ప్రీ పోన్ చేశారట. అంటే `పిఎం నరేంద్ర మోది` ఏప్రిల్ 5న విడుదల కానుంది.
previous post
next post