బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఈద్ సందర్భంగా జూన్ 5న ‘భారత్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సల్మాన్పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నారట. సల్మాన్‌ఖాన్‌తో ఉన్న అనుబంధం కారణంగా చరణ్ ఇంతకు ఆయన నటించిన ప్రేమ్‌రతన్ ధన్పాయొ చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు సల్మాన్ భాయ్ కోసం మరోసారి గొంతును అరువిస్తున్నారు చెర్రీ. ఈ చిత్రంలో సల్మాన్ జతగా కత్రినా కైఫ్ నటిస్తుంటే.. దిశాపటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. అబ్బాస్ అలీ జాఫర్ ఈ చిత్రానికి దర్శకుడు.
previous post
next post