ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి మధ్య `సలీమ్` చిత్ర సమయంలో జరిగిన చెక్ బౌన్స్ కేసు విషయంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ మెట్రోపాలిటన్ కోర్టు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై మరో సినిమాకు అడ్వాన్స్‌గా ఇచ్చిన చెక్కును బౌన్స్ చేయించి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ప్రకటించారు. తాను సెషన్స్ కోర్టులో తేల్చుకుంటానని మోహన్ బాబు తెలిపారు. అంత వరకు బాగానే ఉంది. అయితే మోహన్‌బాబు ఇంటి పక్కనే ఉన్న దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి అర ఎకరం స్థలంలోని ఆయన్ని రానీయకుండా బెదిరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారట. తన స్థలంలోకి తనను రానీయకుండా ..మోహన్ బాబు సమస్యలు సృష్టిస్తుండటంతో, వై.వి.ఎస్ మళ్లీ నాయ్య నిపుణులను సంప్రదించాడట. అలాగే మోహన్ బాబుకు పంపిన లీగల్ నోటీసును కూడా జత చేసి ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు వై.వి.ఎస్.చౌదరి. దీనిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
మీడియా మిత్రులందరికీ నమస్కారం..
వై.వి.ఎస్. చౌదరి అను నేను శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై శ్రీ యం. మోహన్‌బాబు నిర్మించిన, ‘సలీమ్’ (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగానూ, రెమ్యూనరేషన్ నిమిత్తం శ్రీ యం. మోహన్‌బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్ విషయమై, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం ’23వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు’ ఎర్రమంజిల్, హైదరాబాద్ వారు.. 2 ఏప్రిల్ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం మీ అందరికీ తెల్సినదే.
ఈ నేపథ్యంలో శ్రీ యం. మోహన్‌బాబు.. సదరు న్యాయసానాన్ని నేను తప్పుదోవ పట్టించినట్లుగా తీర్పు వెలువడిన తదనంతర పత్రికా ప్రకటనలో పేర్కొనడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు శ్రీ యం. మోహన్‌బాబు జల్పల్లి గ్రామం, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై ‘సలీమ్’ చిత్ర నిర్మాణ సమయంలోనే నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, పైన పేర్కొన్న చెక్ బౌన్స్ కేసు కోర్టు తీర్పు తరువాత నన్ను, నా మనుషుల్ని నా స్థలంలోకే రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం నేను న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు.
ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే
మీ
వై.వి.ఎస్. చౌదరి
సినీ దర్శక-నిర్మాత
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!