కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన 2018

Share

ఒక సినిమా హిట్ అయితే ఎంత డబ్బు వస్తుందో, మంచి సినిమా తీస్తే అంత కన్నా ఎక్కువ పేరొస్తుంది. అదే ఒక సినిమాకి డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడితే అంత కన్నా కావాల్సిందేముంది. అలా ఈ ఏడాదలో అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం గురించి. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో 80 టీస్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీయర్‌లో భారీ హిట్‌గా నిలిచింది. ఇందులో సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబు పాత్రలో కనిపించిన చరణ్, ఫర్మామెన్స్ సినిమా రేంజ్‌ ని పెంచింది. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్, ఈ మూవీతో తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. గ్రామీణ నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ వచ్చిన రంగస్థలం సినిమా ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని, రిలీజ్ అయిన అన్ని సెంటర్స్‌లోనూ యునానిమస్ హిట్ గా నిలిచింది. క్రిటిక్స్ కూడా మెప్పించిన ఈ రంగస్థలం సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర 200కోట్ల వసూళ్ల వర్షాన్ని కురిపించింది.
రంగస్థలం తర్వాత అంత పేరు తెచ్చుకున్న మరో సినిమా మహానటి, నిజానికి మహానటతో మరో సినిమాని పోల్చి చూడలేము. బయోపిక్ అంటే డాక్యుమెంటరీ అనుకునే ఆడియన్స్ ఉన్న టైంలో, మహానటి సావిత్రిని గ్లోరిఫై చేస్తూ, అప్పటి పరిస్థితులను చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా క్లాస్, మాస్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా ఆడింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వని దత్ నిర్మాణంలో మిడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందిన మహానటి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో భారీ హిట్‌గా నిలిచి, మంచి కలెక్షన్స్ సాధించింది. అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన ఫస్ట్ తెలుగు బయోపిక్ మూవీగా నిలిచిన ఈ మహానటి, సినిమా చూసిన వాళ్లందరికీ సావిత్రమ్మని గుర్తు చేసింది. నేటి తరానికి సావిత్రమ్మ గురించి చెప్పిన ఘనత కచ్చితంగా ఈ చిత్ర యూనిట్ కే దక్కుతుంది. ఇక ఈ సినిమా భారీ హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలున్నా కూడా పేరు తెచ్చుకోవడానికి కారణం మాత్రం కీర్తి సురేష్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేష్, సావిత్రగా తన అందం అభినయంతో మహానటిని మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ మహానటిని మళ్లీ తెరపై చుస్తున్నామా అనే గొప్ప అనుభూతిని కలిగించింది అంటే అది మహానటిగా కనిపించిన నేటి సావిత్రి గొప్పదనమే.

ఈ రెండు సినిమా స్థాయిలో పేరు తెచ్చుకున్న మరో సినిమా సమ్మోహనం. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే డైరెక్టర్ ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ, ఘట్టమనేని హీరో సుధీర్ బాబు కలయికలో వచ్చిన ఈ మూవీ సమ్మోహనం. చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయింట్ చేస్తున్నసుదీర్ బాబుకు, దర్శకుడు ఇంద్రగంటికి ఈ మూవీ పేరునీ, ఇమేజ్‌ని, సక్సెస్‌ని ఇచ్చింది. ఒక కొత్త ప్రేమకథని తీసుకొని, దానికి తన మార్క్ ని కలిపిన ఇంద్రగంటి, అతని స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో, ఆడియన్స్‌ని మెప్పించి బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టడమే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్నాడు. మంచి కథకి అంతకుమించిన మంచి యాక్టింగ్ క్యాపబిలిటీస్ ఉన్నలీడ్ పెయిర్ కలిస్తే ఎలా ఉంటుందో సమ్మోహనం సినిమా చూపించింది.

పైన చెప్పిన మూడు చెప్పిన సినిమాలు మంచి కథలతో ఒక మోస్తరు బడ్జట్ తో తెరకెక్కినవి అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమా టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ తో వచ్చిన సినిమా గురించి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఊహించని ట్విస్ట్స్ తో వచ్చిన సినిమా గూఢచారి, అడవి శేష్ లీడ్ రోల్ ప్లే చేస్తూ వచ్చిన ఈ మూవీ తెలుగు సినీ అభిమానులకి కొత్త అనుభూతిని కలిగించింది. రేసీ స్క్రీన్ ప్లే ఈ సినిమా ప్రధాన బలం. పరిమిత బడ్జట్ తో బెస్ట్ స్పై సినిమాని మన తెలుగులో కూడా తీయొచ్చు అని చెప్పడానికి గూఢచారి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. త్వరలో ఈ సినిమాని సీక్వేల్ గా కూడా రాబోతుంది. మరి అది ఏ రోజులో ఉంటుందో చూడాలి.

ఇప్పటి వరకూ చెప్పిన సినిమాలన్నీ ఒకెత్తు ఇప్పుడు చెప్పబోయే సినిమా ఒకెత్తు… ఒక మనిషి జీవితంలోని ఎన్నో సంఘటనలని చూపిస్తూ, నాలుగు కథలుగా తెరకెక్కిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. అసలు స్టార్ కాస్ట్ అనేదే లేకుండా, కొత్త దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాని తెరకెక్కించిన విధానం బాగుంది. మనసుకు హత్తుకుని మనతో పాటు జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి, కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న టాలీవుడ్ సినిమా కంచెలను చెరిపేసి చిత్రమే కేరాఫ్ కంచరపాలెం. అత్యంత సహాజంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా అన్ని రకాల ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. క్రిటిక్స్ నుంచి టాలీవుడ్ బడా దర్శకుల వరకూ ప్రతి ఒక్కరిని ఆర్చర్యపోయేలా చేసిన ఈ చిన్న చిత్రం విదేశల్లోనూ హిట్‌గా నిలిచి మంచి వసూళ్లు సాధించింది.

ఇలా ఈ అయిదు సినిమాలు ఈ ఏఆర్ లో డబ్బులతో పాటు, అందరి మర్యాదని అందుకొని ప్రతి ప్రేక్షకుడిని మెప్పించాయి


Share

Related posts

మెగాస్టార్ ఇంట్లో ఎయిటీస్ స్టార్స్

Siva Prasad

సింగర్ సునీత రెండో పెళ్ళి… కాబోయే భర్త ఎవరో తెలుసా!

Teja

18 ఏళ్ల తర్వాత సీక్వెల్‌

Siva Prasad

Leave a Comment