తనతో వర్క్ చేసే చిత్ర యూనిట్ ని ప్రభాస్ చేసుకున్నట్లు ఎవరు చేసుకోరు అనేది ఇండస్ట్రీ అంతా తెలిసిన విషయమే, ఇంటి నుంచి రకరకాల వంటలతో విందు భోజనం తెప్పించే ప్రభాస్ తన లేటెస్ట్ ఫిల్మ్ సాహో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధ కపూర్ పుట్టిన రోజు కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని చిత్ర వర్గాల సమాచారం. దాదాపు రెండుళ్లుగా కలిసి నటిస్తున్న శ్రద్ధతో మంచి రిలేషన్ ఏర్పడిన ప్రభాస్, శ్రద్ధకి ఒక కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా సెట్స్ లో కేక్ కటింగ్ కూడా చేయించాడట. ఏదిఏమైనా మర్యాదలు చెయ్యడంలో ఎవరైనా డార్లింగ్ తర్వాతే కదా. అది సరే ప్రభాస్, శ్రద్ధకి గిఫ్ట్ ఇచ్చాడు బాగానే ఉంది కానీ మరి సాహో ప్రొడ్యూసర్స్ ఈ బర్త్ డే బేబీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా?
గతంలో ప్రభాస్ పుట్టినరోజున షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేసిన యువీ క్రియేషన్స్, ఇప్పుడు శ్రద్ధ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 3 ఉదయం 08:20 నిమిషాలకి మరో మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఈ మేకింగ్ వీడియోలో శ్రద్ధ చేసే స్టంట్స్ హైలైట్ గా ఉంటాయని, ఆమె క్యారెక్టర్ కి సంబంధించి ఒక మంచి క్లూ కూడా ఇస్తారని తెలుస్తోంది. ఒకపక్కన ఇండియన్ సూపర్ స్టార్ బాహుబలి గిఫ్ట్ ఇవ్వడం, మరోపక్క 200కోట్ల బడ్జట్ తో తెరకెక్కుతున్న సినిమా నుంచి మేకింగ్ వీడియో గిఫ్ట్ గా బయటకి రావడం చూస్తుంటే శ్రద్ధ కపూర్ కి ఇంతకంటే స్పెషల్ బర్త్ డే ఏముంటుంది చెప్పండి.
previous post