టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలైన సీజన్ సమ్మర్. వేసవిని టార్గెట్ చేసుకుని చాలామంది నిర్మాతలు భారీ ఎత్తున సినిమాలు స్టార్ట్ చేస్తుంటారు. దాదాపు రెండు నెలలు సెలవులు వచ్చే పరిస్థితి ఉండటంతో.. సమ్మర్ కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున బిజినెస్ జరుగుద్ది. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఈ ఏడాది కాకముందు గత రెండు వేసవి సీజన్ లు సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. కానీ ఈసారి పరిస్థితులంతా సద్దుమనగటంతో కేసులు తగ్గు ముఖం పట్టడంతో పెద్ద పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. “భీమ్లా నాయక్”, RRR, KGF 2, ఆచార్య, రాదేశ్యాం.
ఇదిలా ఉంటే వచ్చే వేసవికి గట్టిగానే పెద్ద సినిమాలు విడుదల కానున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా వాస్తవానికి సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో.. ఇటీవల వేసవికి విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “RC15” సినిమా కూడా రిలీజ్ సంక్రాంతి అని ప్రారంభంలో అన్నారు.
ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న విధానం బట్టి చూస్తే సినిమా వచ్చే వేసవికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొరటాల శివ ఎన్టీఆర్ మూవీ, ప్రభాస్ “సలార్”, పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు”..వంటి బడా స్టార్ హీరోల సినిమాలు వచ్చే ఏడాది వేసవిలో విడుదలవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి వీటిలో కొన్ని సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.