ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రభావం కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో చిన్న సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను ఆశ్రయిస్తున్నాయి.
జులై 3న కూడా మూడు సినిమాలు ఓటిటిల్లో విడుదల కానున్నాయి. సూఫీయుమ్ సుజాతియుమ్ అనే మలయాళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అలాగే నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన భానుమతి & రామకృష్ణ రేపు ఆహా ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. ముందు భానుమతి రామకృష్ణ అనే టైటిల్ అనుకున్నా కానీ అలనాటి నటి భానుమతి కొడుకు భరణి చిత్ర టైటిల్ పై కోర్టును ఆశ్రయించడంతో టైటిల్ లో మార్పు చేసారు. ఇక నిశ్శబ్దం అనే చిన్న తమిళ చిత్రం రేపు జీ5 యాప్ ద్వారా విడుదలకానుంది.