50 లక్ష‌ల సెట్‌…

సాధార‌ణంగా హీరోల కోసం భారీ సెట్స్ వేస్తుంటారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తెర‌కెక్క‌డ‌మే క‌ష్ట‌మ‌వుతున్నాయి.. అయితే క్ర‌మంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరుగుతున్నాయి. అయితే ఓ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ చిత్రాల‌నే ప్రేక్ష‌కులు చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌నే సంగ‌తి కాద‌న‌లేని వాస్త‌వం. త‌మిళ సినిమాల విష‌యానికి వ‌స్తే.. న‌ట‌న ప‌రంగా మంచి గుర్తింపు సంపాదిచుకున్న జ్యోతిక ..సూర్య‌ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి కొన్నేళ్లు దూరంగా ఉన్నారు. త‌ర్వాత మ‌హిళ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌స్తున్నారు. ఆ కోవ‌లో రాజ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే ఓ సినిమాలో జ్యోతిక న‌టిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా క‌న‌ప‌డ‌తారు. అందుకోసం క‌థ డిమాండ్ ప్ర‌కారం 50 ల‌క్ష‌లు వేసి ఓ పాఠశాల‌ను వేస్తున్నార‌ట‌. ఓ హీరోయిన్ సినిమాకు ఇంత పెద్ద సెట్ వేయ‌డం గొప్ప విష‌య‌మే. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.