తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ `96`. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు దిల్‌రాజు. హక్కులు సొంతం చేసుకున్న తర్వాత చాలా మంది హీరో హీరోయిన్లను సంప్రదించాడు. చివరకు శర్వానంద్, సమంతలతో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుంది. సినిమా టైటిల్ విషయంలో యూనిట్ ఓ క్లారిటీకి రానుంది. సినిమాకు జాను లేదా జానకీ దేవి అనే టైటిల్స్ లో ఏదో ఒకదాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది. ఇందులో హీరోయిన్ సింగర్ జానకి అభిమాని. ఆమెలా పాటలు పాడాలనుకుంటుంది. ఓ సన్నివేశంలో సింగర్ జానకమ్మ కనిపిస్తారు కూడా. ఇప్పుడు మరి తెలుగులో జానకమ్మను చూపిస్తారా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే సినిమా సెట్స్‌కు వెళ్లనుంది. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్.. తెలుగు వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు.
previous post
next post