Bheemla nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా విషయంలో ఒక బ్యాడ్ న్యూస్..!

Share

Bheemla nayak: మలయాళం సూపర్ హిట్ సినిమాలు ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్‌లో చాలానే రీమేక్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు దాదాపు మన తెలుగులో రీమేక్ చేస్తే కూడా మంచి కమర్షియల్ సక్సెస్‌లను సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు మలయాళ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు. తమిళ హిట్ చిత్రాల దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

a bad news from bheemla-nayak for pawan kalyan fans

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియుం. దీనిని తెలుగు రీమేక్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ భీమ్లా నాయక్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వాస్తవంగా ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఇది పవన్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. అయితే కరోనా థర్డ్ వేవ్ వల్ల మరోసారి థియేటర్స్ షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నారు.

Bheemla nayak: సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేయడం కష్టమేనని అంటున్నారు.

కాబట్టి రిలీజ్ చేయాల్సి ఉన్నా కూడా ఆపాల్సి ఉండేది. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు మూవీ టీజర్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ అంటే ఖచ్చితంగా సంక్రాంతికి టీజర్ వదలాలి. కానీ, అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేస్తారా..లేక మారుతున్న పరిస్థితులను దృష్ఠిలో పెట్టుకొని మరోసారి పోస్ట్‌పోన్ చేయాలా అని మేకర్స్ సందేహంలో ఉన్నారట. అందుకే టీజర్ అప్‌డేట్ ఇవ్వడం లేదని, సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేయడం కష్టమేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

31 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago