Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నాడు. “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” పరాజయం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన బన్నీ “అలా వైకుంటపురంలో” సినిమాతో భారీ హిట్టు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత “పుష్ప” తో పాన్ ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి ప్రపంచాన్ని షేక్ చేసేసాడు. ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. “పుష్ప” సెకండ్ పార్ట్ పై బయట భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాతో “పుష్ప” తరహా లోనే విజయం సాధించాలని ప్రతి విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు బన్నీ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బన్నీ తన దగ్గర పనిచేసే టీం విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అన్న సంగతి తెలిసిందే. సాధించే ప్రతి విజయాన్ని తన టీం సభ్యులకు ఆపాదిస్తూ… కలుపుకుంటూ పోతాడు. ఇదే సమయంలో.. వాళ్లకి ఎటువంటి కష్టం వచ్చినా అన్ని తానై ఉండి… చూసుకుంటాడు. ఈ క్రమంలో తన దగ్గర పది సంవత్సరాల నుండి కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్.. సొంత ఇల్లు నిర్మించుకోవడానికి.. 15 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వటం జరిగిందట.
వరంగల్ ప్రాంతానికి చెందిన మహిపాల్ అల్లు అర్జున్ వ్యక్తిగత డ్రైవర్ గా గత పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. హైదరాబాద్ బోరబండ లో నివాసం ఉంటున్న మహిపాల్ రెడ్డి వలె ఇల్లు నిర్మించుకుంటున్నట్లు విషయం తెలుసుకుని… 15 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రైవర్ కి చేసిన సాయం పట్ల బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.