Charan Pooja Hegde: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. RRR తో వచ్చిన క్రేజ్ చరణ్ కి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. చరణ్ తో చేయడానికి చాలామంది నిర్మాతలు.. దర్శకులు క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. RRR చరణ్ కి విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చింది. అమెరికా వంటి దేశాలలో పెద్ద పెద్ద స్టూడియోలలో మనోడు ఇంటర్వ్యూలు ఇవ్వటంతో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో చరణ్ తో నటించటానికి చాలామంది పోటీ పడుతున్నారు. దీనిలో భాగంగా తాజాగా బుట్ట బొమ్మ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇదే విషయాన్ని తాజాగా తెలియజేసింది.
ఇటీవల సల్మాన్ ఖాన్ తో నటించిన “కిసీ కా బాయ్ కిసీ కా జాన్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా… పూజా హెగ్డే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామ్ చరణ్ తో పూర్తిస్థాయి సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. ఇప్పటివరకు అతిథి పాత్రలో మాత్రమే చేయడం జరిగింది. త్వరలోనే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పుకొచ్చింది. గతంలో “ఆచార్య”లో ఆ తర్వాత “రంగస్థలం”… తాజాగా “KBKJ” లో చరణ్ పక్కన పూజ హెగ్డే స్టెప్పులు వేయడం జరిగింది.
ఈ క్రమంలో ఫుల్ లెన్త్ సినిమా చరణ్ తో చేయాలని ఉందని స్పష్టం చేసింది. మరోపక్క పూజా హెగ్డే స్టార్టింగ్ లో నటించిన సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి విజయాలు సాధించాయి. కానీ ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆచార్య, రాదే శ్యాం, బీస్ట్, మాస్క్, KBKJ ఈ ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజ హెగ్డే కి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. మరి రాబోయే రోజుల్లో చరణ్… బుట్ట బొమ్మకి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.