Allu Arjun: అక్టోబర్ 17వ తారీకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ జాతీయ అవార్డు అల్లు అర్జున్ అందుకోవటం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు ఏ హీరో ఈ అవార్డు అందుకోలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడంతో చరిత్ర సృష్టించినట్లు అయింది. 2021 ఏడాదికి గాను “పుష్ప” సినిమాకి ఉత్తమ జాతీయ నటుడు అవార్డుతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు కూడా వరించింది. “పుష్ప” సినిమాకి జాతీయ అవార్డు వచ్చినట్లు ప్రకటన చేయటంతో కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ సుకుమార్ మరియు నిర్మాతలు అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా.. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో మేనరిజం మరియు డైలాగ్స్.. దేశాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాకి జాతీయ అవార్డు అందుకోవటం జరిగిందో వెంటనే డైరెక్టర్ సుకుమార్ పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఘనత సాధించడానికి కారణం మీరే అని క్రెడిట్ ఆయనకు ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు.. జాతీయ అవార్డు అందుకున్న అనంతరం పుష్ప సెకండ్ డిపార్ట్ విషయంలో.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. మేటర్ లోకి వెళ్తే ఇది రెండో భాగం సినిమాతో ఆగిపోకూడదు మూడో పార్ట్ కూడా కొనసాగేలా.. ప్లాన్ చేయమని డైరెక్టర్ సుకుమార్ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సెకండ్ పార్ట్ అయిన వెంటనే మూడో పార్ట్ కూడా స్టార్ట్ చేద్దామని.. అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఏమైనా “పుష్ప” సినిమాకి రెండు జాతీయ అవార్డుల రావటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.