Oscar For RRR: భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమాతో వరుసగా రెండుసార్లు ₹1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుడిగా జక్కన్న రికార్డు సృష్టించారు. “RRR” కి మందు “బాహుబలి 2” చరిత్ర సృష్టించడం జరిగింది. కానీ “బాహుబలి 2” కంటే “RRR” ద్వారా రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. కారణం చూస్తే “బాహుబలి 2” విడుదలైన సమయంలో ఓటిటికి అంతగా క్రేజ్ లేదు. “RRR” నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

“RRR” చూసిన తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు దర్శకులు దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా కొమరం భీం పాత్ర చేసిన ఎన్టీఆర్ పాత్ర పై చాలా దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. “ఆస్కార్” బరిలో కూడా నిలిచింది. ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత జాసన్ బ్లమ్ “RRR” కి మద్దతు తెలిపాడు. “RRR” ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. నేను “RRR” విన్నింగ్ బెస్ట్ పిక్ తో వెళ్తున్నాను. దయచేసి దీనిని గుర్తించండి అని ట్వీట్ చేయగా…ఇతర హాలీవుడ్ ప్రతినిధులు ఏకీభవిస్తూ..”RRR” కి జై కొడుతున్నారు.

కచ్చితంగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని తాజా పరిణామాలపై “RRR” గురించి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విదేశీ మీడియాలకు రాజమౌళి ఇస్తున్న ఇంటర్వ్యూలలో చాలావరకు “RRR” కీ సిక్వల్ కి అవకాశం ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. దీంతో మెగా మరియు నందమూరి అభిమానులు “RRR 2” త్వరగా సెట్స్ పైకీ రావాలనీ కోరుకుంటున్నారు. కానీ మహేష్ ప్రాజెక్ట్ అయిన తర్వాతే “RRR” సిక్వల్ చేసే ఆలోచనలలో జక్కన ఉన్నట్లు సమాచారం.