న్యూస్ సినిమా

NTR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు..

Share

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఆయన సినిమా వచ్చి నాలుగేళ్ళవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో లాకయిన ఎన్టీఆర్ రాజమౌళి పెట్టిన కండీషన్ వల్ల మరో సినిమాను చేయలేకపోయాడు. దాంతో ఆయన నుంచి అరవింద సమేత తర్వాత మళ్ళీ సినిమా రానేలేదు. ఇదే అభిమానులకు పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయి మరో పెద్ద డిసప్పాయింట్ చేసింది. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన చరణ్ తన నెక్స్ట్ సినిమాలను ప్రకటించాడు.

a new update to ntr-fans
a new update to ntr-fans

వాటిలో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఆర్సీ 15 చిత్రాన్ని మొదలు పెట్టి షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. కానీ, ఎన్టీఆర్ సినిమా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనుకున్నది కాస్త ఆగిపోయింది. ఇప్పుడదే ప్రాజెక్ట్‌ను కొరటాల శివ చేయబోతున్నాడు. ఆచార్య సినిమా పూర్తి చేసిన తర్వాత కొరటాల దీనిని మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అలాగే ఆచార్య సినిమాకు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చాయి. దాంతో ఈ ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 30 మొదలుపెట్టనున్నారు.

NTR: ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా కన్‌ఫర్మ్ చేశారు.

ఇప్పటికే ఈ విషయాన్ని ఆ మధ్య ఎన్టీఆర్ కూడా కన్‌ఫర్మ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అభిమానులు దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌తో సోషలో వైరల్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే ఎన్టీఆర్ 30 – కొరటాల శివ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతుందట. అధికారికంగా అనౌన్స్ చేసి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో.. యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించబోతున్నారు.


Share

Related posts

చంద్రబాబు నోట ఇలాంటి మాట ఎప్పుడూ వినలేదు..! ఇంత లోపల పెట్టుకొని బయటకు మాత్రం…

arun kanna

పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఉచితం.. మీకు కావాలా?

Teja

స్పైడర్‌ వుమన్‌గా సమంత.. పోస్టులను షేర్‌ చేసింది..!

Srikanth A
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar