RRR: RRR నుండి ఓ సీన్ లీక్.. ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య భీకర పోరాటం!

Share

RRR: ఇపుడు ఇండియాలో ఎక్కడ విన్నా ఒకటే వినబడుతోంది. అదే RRR. అవును రాజమౌళి ఎప్పుడైతే RRRని ప్రకటించాడో, ఆ క్షణం నుండి అందరి చూపులు ఈ సినిమా పైనే వున్నాయి. మరికొన్ని రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలే వున్నాయి. ఓ వైపు బాహుబలి తరువాత సినిమా అవడం, మరోవైపు జక్కన్న సినిమా అవడం, ఇంకోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించడం అనే మూడు అంశాలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు మేకర్స్. ఈ సందర్భంగానే అనేక విషయాలు వెల్లడవుతున్నాయి.

Bheemla Nayaak: న్యూ ఇయర్ రోజు “భీమ్లా నాయక్” సరికొత్త సందడి..!!

ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య భీకర పోరాటం ఇదేనా?

RRR బాహుబలిని మించి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నెల మొదటి వారంలో విడుదల చేసిన ట్రైలర్ సినిమాపైన ఓ రేంజ్ అంచనా పెంచేసింది. నిన్నగాక మొన్న చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. ఇంటర్వెల్ ఫైట్ గురించి లీక్ చేసారు. ఆ సీన్ అటు ఎన్టీఆర్ అభిమానులకు, ఇటు చరణ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుందని అన్నారు. విషయంలోకి వెళితే, ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించి ఓ 16 నిమిషాల పాటు ఆ ఫైట్ కొనసాగనుందట. అందులో పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్.. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడే ఎన్టీఆర్ వీరలెవల్లో రెచ్చిపోతారట.

Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్..!!
ఈ సినిమా జనవరి 7 ఖచ్చితముగా రిలీజ్ అవుతుందా?

అవును.. ఈ మాటను జక్కన్న మరోమారు నొక్కివక్కాణించారు. ఈ డేట్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ వున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది మరి. అయితే తాజాగా ఈ అనుమానాన్ని జక్కన్న పటాపంచలు చేసారు. సో ఆల్ క్లియర్ అన్నమాట. ఆరోజు మనం ఇద్దరి మధ్య సాగే హైలైట్ ఫైట్ ని చూడబోతున్నాం. తారక్, చెర్రీలు సింహాల్లా ఒకరికి మించి మరొకరు నువ్వా–నేనా అన్నట్టు ఆ సీన్ లో ఒదిగిపోయారట. ఇక ఆ సీన్ ను తనివితీరా చూడాలంటే మాత్రం జనవరి 7 దాకా వెయిట్ చేయాల్సిందే.


Share

Related posts

Megha Akash: మేఘా ఆకాష్‌కు అవకాశాలు వస్తున్నాయి గానీ..అవి ఆమెకు ఎందుకు పనికి రావడం లేదు..?

GRK

MAA Elections: రాజకీయాలకు మించిన సినిమా..!? మా కు బుద్దిలేదేమో..!?

Srinivas Manem

Bheemla nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి రాసిపుట్టుకోండి..మిస్ అయ్యే ఛాన్సే లేదు..

GRK