Samantha Naga Chaitanya: తెలుగు చలనచిత్ర రంగంలో ఒకప్పుడు పెళ్లయిన జంటలలో నాగచైతన్య… సమంత జంట చాలా చూడా ముచ్చటగా ఉండేది. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. 2017లో పెళ్లి అయితే… 2021లో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఏ కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారన్నది.. కొన్నాళ్ల వరకు ఎవరికి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ ఈ ఏడాది నాగచైతన్య నటించిన “కస్టడీ” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో.. విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. తమ మధ్య సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కారణంగా.. విడిపోయినట్లు తెలిపాడు. అయితే వాస్తవానికి చైతన్య.. సమంత వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు తెరపై చాలా హ్యాపీగా కనిపించే ఈ జంట తెరవ వెనక మాత్రం ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారంట. ఈ విషయాన్ని చాలా దగ్గరగా వాళ్ళిద్దరికీ క్లోజ్ గా ఉండే సన్నిహితులు ఇటీవల బయటపెట్టారు. ఇద్దరు కూడా మొండి వాళ్లని ఎవరూ కూడా మాట పడరని చెప్పుకొచ్చారు. చిన్న విషయంలో ఏదైనా గొడవ అయింది అంటే అసలు ఎవరికి వారు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటారని. ఇద్దరికీ స్టేటస్ ఫీలింగ్ ఎక్కువగా ఉండేదని.. ఆ కారణంగానే విడాకులకు బీజం పడిందని చెప్పుకొచ్చారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట..కార్యక్రమంలో సమంత .. బాగా మద్యం సేవించి.. ఒక్కసారిగా నాగచైతన్యతో పడుతున్న గొడవలు మొత్తం కుటుంబ సభ్యుల వద్ద నోరు విప్పడం జరిగిందట.
కంట్రోల్ తప్పి నాగచైతన్య మీద మద్యం మత్తులో ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగిందట. దీంతో తన ఫ్యామిలీ సభ్యుల మధ్య తను గురించి తప్పుగా మాట్లాడటంతో చాలా హర్ట్ అయినా నాగచైతన్య వెంటనే విడాకులు అప్లై చేద్దామంటూ మొదట ప్రపోజల్ తీసుకొచ్చి చివరాఖరికి సమంతానీ వదిలించుకున్నాడట. అసలు ఆ ఒక్కరోజు సమంత మందు తాగకుండా.. సైలెంట్ గా ఉంటే ఆ చిన్న తప్పు జరగకుండా ఉంటే.. వీరిద్దరూ విడిపోయే వాళ్ళు కాదని అన్నారు. సమంత తాగి ఇష్టానుసారంగా మాట్లాడటం తోనే నాగచైతన్య.. విడాకుల విషయంలో దూకుడుగా వెళ్లారని చెప్పుకొస్తున్నారు.