ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా చేయలేని పరిస్థితి ఉండటంతో… నేడు పరిస్థితులంతా బాగానే ఉండటంతో.. భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క జనసేన పార్టీకి తమ వంతుగా విరాళాలు కూడా అందజేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే ఈరోజు సాయంత్రం “హరిహర వీరమల్లు” నుండి అప్ డేట్ వస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే.
అయితే దానికంటే ముందుగానే డైరెక్టర్ క్రిష్ పవన్ బర్త్ డే స్పెషల్.. పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గుర్రపు బండి పై స్వారీ.. చేస్తూ కనిపిస్తున్నారు. వెనకాల సైనికులు తరుముతూ ఉన్నారు. ఎర్రని వస్త్రంలో ‘వీరమల్లు’ కట్టిన మూట చూస్తుంటే, ఆయన ఏవో వస్తువులు దొంగిలించి పారిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ దొంగగా నటిస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. చారిత్రాత్మకమైన సినిమా అని… మొగలుల సామ్రాజ్యం కాలం నాటి తరహాలో ఒక వజ్రం దక్కించుకోవడం కోసం.. పోరాడే సినిమా అని అంటున్నారు.
ఏది ఏమైనా నేడు సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు “హరిహర వీరమల్లు” అప్ డేట్ ఇస్తున్నట్లు మరో మారు డైరెక్టర్ క్రిష్ తెలియజేశారు. దీంతో అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో పవన్ ..హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే.. రెండో సినిమా “భగత్ సింగ్ భవదీయుడు” అప్ డేట్ కూడా వస్తే బాగుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.