Pawan Kalyan: తెలుగు చలనచిత్ర రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గాని తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కెరియర్ కొనసాగింది. దాదాపు పది సంవత్సరాలు పాటు హిట్టు లేకపోయినా గాని టాప్ హీరోలలో ఒకరిగా రాణించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు ఆయన భావజాలాలకు అనుగుణంగానే రాజకీయాలలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో ఉన్నాగాని ఎక్కువగా సమాజంపై ఆయన దృష్టి ఉంటుంది. ప్రజలకు ఏదైనా మంచి చేయాలి.. ఇతరులకు సహాయపడాలి అనే గుణం కలిగిన వ్యక్తి. చేసిన మంచిని కూడా ఇతరులతో పెద్దగా పంచుకోరు.
ఈ క్రమంలో పవన్ గురించి సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రారంభంలో హీరో అవ్వాలని ఆలోచన లేదట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగిందట. కానీ కుటుంబ సభ్యులు హీరో అయితేనే బాగుంటుందని చెప్పడంతో తన నిర్ణయాన్ని బలవంతంగా మార్చుకున్నారు. ముఖ్యంగా పెద్దన్నయ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఒప్పించి హీరోగా మార్చడం జరిగిందట. ఇకపోతే డైరెక్టర్ కావాలనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది..అని కొత్త విషయం బయటపడింది. ఆ సమయంలో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో షార్ట్ ఫిలిం టర్మ్ కోర్స్ కోసం.. పవన్ కళ్యాణ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి షార్ట్ ఫిలిం తీయడం జరిగిందట.
ఈ షార్ట్ ఫిలింలో అంధుల జీవితాలు గురించి.. ఉంటుందట. అయితే ఇప్పుడు ఈ వార్త పట్ల పవన్ అభిమానులు ఆ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో పెట్టాలని తెగ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతూ మరోపక్క హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి.