krithi shetty: `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. ఓ డైరెక్టర్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది. అయితే ఇది రియల్ కాదులేండి.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృతి శెట్టి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఒకటి. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. `రోల్ సౌండ్.. రోల్ కెమెరా.. యాక్షన్` అని సుధీర్ బాబు చెప్పడంతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం అందంగా, ఆసక్తికరంగా సాగింది. ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్ హిట్లు అందించిన కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్‌గా సుధీర్ బాబు, సినిమాలంటే అసలు పడని కళ్ళ డాక్టర్‌గా కృతి శెట్టిలు కనిపించబోతున్నారు.
అయితే ప్రిన్సెస్ లాంటి ఓ అమ్మాయి చుట్టూ జరిగే కథని సినిమాగా తీయాలని సుధీర్ బాబు నిర్ణయించుకుని.. డాక్టర్ అయిన కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడటం, చివరకు కృతి సినిమా చేయడానికి ఓకే చెప్పి ఒక కండీషన్ పెట్టడంతో టీజర్ ముగుస్తుంది.
మొత్తానికి టీజర్ బట్టీ చూస్తుంటే ఇదో ఇంట్రస్టింగ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరి అని స్పష్టంగా అర్థమైంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫైనల్‌గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా టీజర్ అదిరిపోవడంతో అటు సుధీర్ బాబు, ఇటు కృతి శెట్టిల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.