లింగమార్పిడికి సంబంధించిన చిత్రంలో ఆదాశర్మ నటిస్తున్నారు. `హార్ట్ ఎటాక్`, `క్షణం` చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన భామ ఆదా శర్మ. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లతో సోషల్ మీడియాలో నెటిజన్లను అబ్బురపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె ఒక థ్రిల్లర్‌లో అబ్బాయిగా నటిస్తోంది. అబ్బాయి నుంచి అబ్బాయి వరకు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో ఆదాను నవీన్ కస్తూరియా వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె నిజానికి అబ్బాయి అని, లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారిందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందనే కథతో ఈ సినిమా రూపొందుతోంది. `నా తొలి చిత్రం `1920` నుంచి `కమాండో 3` వరకు నేను అన్నీ వైవిధ్యమైన పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాను. తొలిసారి అబ్బాయిగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది` అని అన్నారు. “ఇందులో ఎంటర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ సమపాళ్లలో ఉంటాయి. ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో కరెంట్ ఇష్యూ జెండర్ యాక్సెప్టెన్స్ కి సంబంధించిన అంశాలను చర్చిస్తున్నాం“ అని నవీన్ తెలిపారు. ఈ కథను అబిర్ సేన్ గుప్తా రాశారు. ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా గురించి అబిర్ మాట్లాడుతూ “ఆదా, నవీన్‌తో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాను కేవలం ప్రేక్షకులు ఆస్వాదించడమే కాదు, ఇందులో చెప్పిన మెసేజ్‌ను కూడా తమతో పాటు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది“ అని చెప్పారు. వివిద్ ఆర్ట్ హౌస్, అనుశ్రీ అబిర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జెయ్ సాహ్ని, సేన్‌గుప్తా, అనుశ్రీ మెహతా నిర్మాతలు.
previous post
next post