సినిమా

Aadavallu Meeku Joharlu: అదిరిన‌ `ఆడవాళ్లు మీకు జోహార్లు` టీజ‌ర్‌.. పీక్స్‌లో శ‌ర్వా ఫ్రస్ట్రేషన్‌!

Share

Aadavallu Meeku Joharlu: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్లైన ఖుష్బు, రాధిక, ఊర్వశి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. `ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో పదిమంది ఆడాళ్ళు ఉండి ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం` అంటూ శర్వా డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్‌.. ఆద్యంతం సూప‌ర్ ఫ‌న్నీగా సాగ‌డ‌మే కాదు విశేషంగా ఆక‌ట్టుకుంది కూడా.

ఇంట్లో మహిళలు ఆధిపత్యం చెలాయించడం వల్ల.. వారికి న‌చ్చిన‌ అమ్మాయిని తీసుకురాలేక శ‌ర్వా ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటాడు. అలాంటి టైమ్‌లో అత‌డికి ర‌ష్మిక క‌నిపించ‌డం, ఆమె ప్రేమ‌లో ప‌డిపోవ‌డం జ‌రిగిపోతాయి. ఆమె సైతం శ‌ర్వాను ఇష్ట‌ప‌డుతుంది. కానీ, ర‌ష్మిక మ‌న‌ పెళ్లి జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు శ‌ర్వా ఏం చేశాడు..? అస‌లు ర‌ష్మిక పెళ్లి ఎందుకు జ‌ర‌గ‌ద‌ని చెప్పింది..? అన్న‌దే క‌థ అని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా బాగున్నాయి. అలాగే ఈ మూవీలో ఆడ‌వాళ్ల దెబ్బ‌కు శ‌ర్వా ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌లో ఉండ‌నుంద‌ని టీజ‌ర్ ద్వారానే తెలిసిపోతోంది. మొత్తానికి అదిరిపోయిన తాజా టీజ‌ర్‌.. సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.


Share

Related posts

Yash: ప్ర‌భాస్ హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న య‌శ్‌.. ఆమె అంత ఇష్టమా?!

kavya N

ఆ ఫ్లాప్ మూవీ వ‌ల్ల 3 నెల‌లు బ‌య‌ట‌కే రాలేక‌పోయా: శ‌ర్వానంద్‌

kavya N

Samantha: ఇంట్లో కాకుండా అక్క‌డే ఉంటున్న స‌మంత‌..ఏమైందంటే?

kavya N