Aadipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడం జరిగింది. ఇప్పటికే పాటలకు సంబంధించి రిలీజ్ అయిన కొన్ని గ్లింప్స్ వీడియోస్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం జరిగింది. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేయటం జరిగింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ “ఆదిపురుష్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది స్టార్టింగ్ లో జనవరి నెలలో విడుదల కావాల్సింది. కానీ ఫస్ట్ టైం విడుదల చేసిన టీజర్.. పై నెగిటివ్ కామెంట్స్ రావడంతో రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా మొదటిసారి విడుదల చేసిన టీజర్ పై మండిపడ్డారు. విజువల్ గ్రాఫిక్స్ వర్క్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇప్పుడు మార్పులు చేర్పులు చేసి భారీ ఎత్తున గ్రాఫిక్స్ కి తగ్గట్టు ఎఫెక్ట్స్ సెట్ చేసి లేటెస్ట్ గా “ఆదిపురుష్” ఫ్రెష్ ప్రింట్ తో… జూన్ 16వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలు సినిమా యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.
ఇప్పటికే టీజర్ తో పాటు పాటలను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచడం జరిగింది. ఈ క్రమంలో 9న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. అయితే అన్నిటికంటే ముందుగా తెలుగు భాషల్లో ఒకరోజు ముందుగా అనగా 8వ తారీఖు నాడు..”ఆదిపురుష్” విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్స్ స్పష్టం చేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!