Aamani: ఆమని హీరోయిన్ల తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. శుభలగ్నం సినిమా లో ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయింది.. ఈ సినిమా తన కెరియర్ ను మలుపు తిప్పింది.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఈమె నటించింది.. ఇటీవల ఒక టీవీ షోకి హాజరైన ఆమె ఊహించని నిజాలు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది..
కొంతకాలంగా ఇటీవల వెండి తెరకు దూరమైన ఆమని.. ముత్యమంత ముద్దు సీరియల్ తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది.. అప్పటికీ ఇప్పటికీ అదే నటనతో ప్రేక్షకులను టీవీ లకు కట్టిపడేస్తుంది. ఇటీవల ఒక టీవీ షో కి ఆమనీ హాజరవ్వగా.. తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అని సినిమా అవకాశాల కోసం డైరెక్టర్లు దగ్గరకు వెళ్లగా వారు అవకాశం ఇస్తామని.. సినీ ఛాన్స్ తోపాటు తమ గెస్ట్ హౌస్ కూడా రావాలని.. నీతో పాటు మీ అమ్మను తీసుకు రావద్దు.. నువ్వు ఒక్కదానివే రా అని చెప్పటంతో వాళ్ళ విషయం తను అర్థమై.. అలాంటి వాళ్లకు దూరంగా ఉన్నానని.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇలా నాతో మాట్లాడారని ఆమని చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమవుతున్న ముత్యమంత ముద్దు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తుంది ఆమని.