బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలతో సినిమాను చేయడానికి ఇష్టపడే ఆమిర్ ఇప్పుడు తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆయనకు మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఉందట. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో హిస్టారికల్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి తరుణంలో శివాజీ జీవితకథను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నానని ఓ సందర్భంలో తెలిపారు ఆమిర్. మరి ఆమిర్ కోరిక విన్న దర్శక నిర్మాతలు ఎవరు ఇలాంటి కథతో ఆయన దగ్గరకు వెళతారో చూడాలి.
ప్రస్తుతం ఈయన `ఫారెస్ట్ గంప్స్` అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఓ కథను సిద్ధం చేస్తున్నాడు. `లాల్ సింగ్ చద్దా` పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించబోతున్నారు. పాత్రల కోసం రిస్క్ చేసే ఈ హీరో ఈ సినిమా కోసం 20 కిలో బరువు తగ్గుతున్నాడు. ఈ సినిమాలో ఆమిర్ సిక్కు యువకుడిగా కనపడతాడు.
previous post
next post