హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘లాల్సింగ్ చద్దా’ ఆగస్టు 11 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా నాగచైతన్య కూడా కీలక పాత్ర చేయడం జరిగింది. అయితే ప్రారంభంలో ఈ సినిమా హిందీలో మాత్రమే విడుదలవుతుందని భావించగా ఇప్పుడు తెలుగు వర్షన్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ‘లాల్సింగ్ చద్దా’ తెలుగు వర్షన్ బాధ్యతలను లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు.
స్వయంగా చిరంజీవి సమర్పణలో తెలుగు ‘లాల్సింగ్ చద్దా’ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. నా ప్రియమైన మిత్రుడు అమీర్ ఖాన్ అద్భుతమైన ఎమోషనల్ రోల్ చేసిన ‘లాల్సింగ్ చద్దా’ తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని నచ్చుతుంది అంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇటీవల ‘లాల్సింగ్ చద్దా’ స్పెషల్ షో చిరంజీవి ఇంటిలో వేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమీర్ ఖాన్, నాగచైతన్య, నాగార్జున, సుకుమార్, రాజమౌళి వీక్షించారు. ఆ సమయంలో చిరంజీవి అమీర్ ఖాన్ నటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం మాత్రమే కాదు సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా సన్మానించడం కూడా జరిగింది. ఇటువంటి తరుణంలో ‘లాల్సింగ్ చద్దా’ స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయడానికి ముందుకు రావడం.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది.