NewsOrbit
సినిమా

చిరంజీవి కెరీర్ లక్కీ రిలీజ్ డేట్స్ లో ఆచార్య, వకీల్ సాబ్..!!

acharya and vakeel saab on chiranjeevi lucky dates

MEGA ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుందంటేనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. అటువంటిది MEGA STAR CHIRANJEEVI, పవర్ స్టార్ PAWAN KALYAN  సినిమాలంటే ఇంకెంత హడావిడి ఉంటుంది. TOLLYWOOD ఫిలిం సర్కిల్స్ పెద్ద చర్చే జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ లో సందడి ఆకాశాన్నంటుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా వీరి సినిమాల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. డ్యామ్ లో గేట్లు ఎత్తేస్తే ఉరకడానికి సిద్ధంగా ఉన్న నీటిలా ఉంది వారి పరిస్థితి. CHIRANJEEVI, PAWAN KALYAN సినిమాలు ఇటివలే షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ACHARYA షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంటే.. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైంది. ఇక రిలీజ్ డేట్ కోసం ఎదరు చూపులు. ఇప్పుడీ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

acharya and vakeel saab on chiranjeevi lucky dates
acharya and vakeel saab on chiranjeevi lucky dates

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలకు 9వ  తేదీ, నెంబర్ లక్కీగా ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 9, మే 9 తేదీలు చిరంజీవికి బాగా కలిసొచ్చాయి. 1992 ఏప్రిల్ 9న ఘరానామొగుడు సినిమా రిలీజై సాధించిన హిట్ ఓ చరిత్ర. తెలుగు సినిమాల్లో తొలిసారి 10కోట్లు షేర్ సాధించిన సినిమాగా ఘరానామొగుడుకు చెరిగిపోని రికార్డు ఉంది. 1998 ఏప్రిల్ 9న బావగారూ.. బాగున్నారా.. సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మే9న చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1990 మే9న జగదేకవీరుడు అతిలోకసుందరి విడులైంది. ఈ సినిమా తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచి ఇండస్ట్రీ హిట్ సాధించింది. తర్వాత ఏడాదే.. 1991 మే9న GANG LEADER రిలీజ్ అయింది. చిరంజీవిని తెలుగు సినిమాకు మకుటంలేని మహారాజును చేసింది. ఇప్పుడీ లక్కీ డేట్స్ లోనే MEGA BROTHERS 2021లో సందడి చేయబోతున్నారని టాక్.

ఏప్రిల్ 9న PAWAN KALYAN వకీల్ సాబ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జనవరి 14 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి ఆ డేట్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు రౌండ్ అవుతున్నాయి. MEGA STAR CHIRANJEEVI ఆచార్య సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి CHIRANJEEVI లక్కీ డేట్ MAY 9న రిలీజ్ అనుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో గాసిప్స్ గా రౌండ్ అవుతున్నాయి. ఈ లక్కీ డేట్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. మరి.. ఈ న్యూస్ అఫీషియల్ అయితే ఇంకెంత సంబరపడిపోతారో..! మరి మేకర్స్ DECISION ఏంటో..!?

 

 

author avatar
Muraliak

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri