Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. మణిశర్మ స్వరాలు అందించాడు. అలాగే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసంగా విడుదలైన ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం.. తొలి షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్, భారీ సెట్టింగ్ ఉన్నా.. కథలో ఏమాత్రం కొత్తదనం ఉండదు. అందుకు తగ్గట్లే కథనం కూడా చాలా నీరసంగా సాగుతుంది. దాంతో ఆచార్యపై నిన్న చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈ చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టి అదరగొట్టింది. తెలుగులో రాష్ట్రాల్లోనే రూ. 29.50 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ. 35.05 కోట్ల రేంజ్లో షేర్ కొల్లగొట్టింది. ఇక ఏరియాల వారీగా ఆచార్య ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం : 7.90 కోట్లు
సీడెడ్ : 4.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.61 కోట్లు
ఈస్ట్ : 2.53 కోట్లు
వెస్ట్ : 2.90 కోట్లు
గుంటూరు : 3.76 కోట్లు
కృష్ణ : 1.90 కోట్లు
నెల్లూరు : 2.30 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ=29.50కోట్లు(40.00కోట్లు~గ్రాస్)
———————-
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 7.10 కోట్లు
ఓవర్సీస్ : 3.85 కోట్లు
———————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్=35.05 కోట్లు((52కోట్లు~గ్రాస్)
———————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 97.45 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ చేయాల్సి ఉంటుంది.