సినిమా

Acharya: రూ. 132 కోట్ల టార్గెట్‌.. 5 రోజుల్లో `ఆచార్య‌`కు వ‌చ్చిందెంతో తెలుసా?

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సిద్ధ అనే కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. ఆయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే చేసింది. సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా విల‌న్లుగా న‌టించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌లైంది.

అయితే భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే నెగ‌టివ్ టాక్ సొంతం చేసుంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కూడా అంతంత మాత్రంగానే వ‌స్తున్నాయి. తెలుగులో రాష్ట్రాల్లో మొద‌టి రోజు రూ. 29.50 కోట్లు, రెండో రోజు రూ. 5.15 కోట్లు, మూడు రోజు రూ. 4.07 కోట్లు, నాల్గొవ రోజు రూ. 53 లక్షల షేర్ వ‌సూల్ చేసిన ఈ మూవీ.. ఐదో రోజు కాస్త ఊపందుకుని రూ. 82 లక్షల రేంజ్‌లో షేర్ క‌లెక్ట్ చేసింది.ఇక ఏరియాల వారీగా ఆచార్య 5 రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం : 12.14 కోట్లు
సీడెడ్ : 6.06 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.81 కోట్లు
ఈస్ట్ : 3.22 కోట్లు
వెస్ట్ : 3.36 కోట్లు
గుంటూరు : 4.56 కోట్లు
కృష్ణ : 3.00 కోట్లు
నెల్లూరు : 2.92 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ‌= 40.07 కోట్లు(58.45 కోట్లు~గ్రాస్‌)
———————-

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.6 కోట్లు
ఓవర్సీస్ : 4.60 కోట్లు
———————–
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌= 47.32 కోట్లు(73.90 కోట్లు~గ్రాస్‌)
———————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొద‌టి ఐదు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా.. ఇంకా రూ.85.18 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూల్ రాబ‌ట్టాల్సి ఉంటుంది.


Share

Related posts

మోడీ రామాలయ నిర్మాణానికీ – ప్రభాస్ ఆదిపురూష్ కీ లింక్ ఉందా ?

GRK

అల్లూ అర్జున్ కోసం కొరటాల శివ ఎంత నాజూకు అమ్మాయిని సెలక్ట్ చేశాడో చూడండి .. !!

arun kanna

Rashmi Gautam Latest Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar