Acharya: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. గత రెండేళ్ళుగా మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే ఆచార్య చాలాసార్లు పోస్ట్‌పోన్ అయింది. సంక్రాంతి సీజన్లో దిగాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ కోసం ఫిబ్రవరికి వాయిదా పడింది.
ఆ తర్వాత భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ సినిమాల పోస్ట్ పోన్‌తో ఏకంగా ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తరుణం రానే వస్తోంది. చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు. ఇదే జోష్‌లో తండ్రితో కలిసి నటించిన ఆచార్య కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించబోతుండగా .. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Acharya: చిరు – చరణ్‌లతో పాటు మెగా హీరోలు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు
ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించ బోతున్నారు. దీనికి యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వేదిక కాబోతోంది. ఇక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే నిర్వహించబోతుండటం ఆసక్తికరం అని చెప్పాలి. ఇక ఈ ఈవెంట్లో చిరు – చరణ్‌లతో పాటు మెగా హీరోలు..టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరవబోతున్నారు. ఈ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. చూడాలి మరి త్వరలో ఎవరెవరు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా రానున్నారో.