సినిమా

Acharya: ‘ఆచార్య’ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది.. తొలి మొబైల్ థియేటర్లో షోలట!

Share

Acharya:టెక్నాలజీ ఇపుడు మనిషిని శాసిస్తోంది. ఇక మనిషి.. దాన్ని అనుసరించక తప్పట్లేదు. కాలానికి అనుగుణంగా.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు వినోదాన్ని అందించటం ఇపుడు సినిమా నిర్మాతల వంతు అయింది. కరోనా విపత్తు తరువాత OTT ఎంతటి మార్కెట్ సంపాదించిందో చెప్పనవసరం లేదు. అలనాడు మనం డేరాల్లో సినిమాలు చూసే స్థాయి నుండి భారీ థియేటర్లులో సినిమాలు చూసే స్థాయికి చేరుకొని, ఇపుడు ఎవరి ఇంట్లో వారే సినిమాలు తిలకించే స్థాయికి చేరుకున్నాం. ఈ క్రమంలో హోమ్ థియేటర్లు మంచి ప్రాచుర్యం పొందాయి.

Acharya: మొబైల్ థియేటర్లు కథ:

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇపుడు మొబైల్ థియేటర్ కు వేదికగా మారింది. స్థానిక GSL మెడికల్ కాలేజీకి దగ్గర్లో హెబిటేట్ రెస్టారెంట్ దీనికి వేదిక కావడం విశేషం. ఇక్కడ తాజాగా ఒక ఆధునిక మొబైల్ థియేటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పిక్చర్ టైమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ మొబైల్ థియేటర్ కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐమాక్స్ లో సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా చేయటమే దీని ప్రత్యేకతగా తెలుస్తోంది. గాలితో నింపిన టెంట్.. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇన్ ప్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ తో తయారు చేసిన ఈ థియేటర్.. అన్ని వాతావరణ పరిస్థితులకు.. అగ్నిప్రమాదాలకు తట్టుకొని నిలిచేలా దీన్ని సిద్ధం చేశారు.

మొదటి సినిమా ఆచార్యే!

35 ఎంఎం స్క్రీన్ తో.. 120 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్ కు ఓ సంవత్సర కాలం పాటు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ థియేటర్ లో సినిమా చూసేందుకు ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా టికెట్లను తీసుకునే వెసులుబాటు కలదు. ఇకపోతే, ఈ థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీతో రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఇప్పటివరకు చూసిన థియేటర్లకు పూర్తి భిన్నంగా ఉండే ఈ సినిమా థియేటర్ లో సినిమాను చూడటం విచిత్రమైన అనుభూతిని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు అక్కడి స్థానికులు. కాగా ఇప్పటికే చిరు ఫాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్నారట.


Share

Related posts

“వకీల్ సాబ్” ని లీక్ చేసింది వాళ్ళే ..!

GRK

హిందీ డ‌బ్బింగ్‌

Siva Prasad

Sudigali Sudheer: సర్జరీ చేయించుకున్న సుడిగాలి సుధీర్..?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar