సినిమా

Acharya: లాక్ అయిన‌ `ఆచార్య` ర‌న్ టైమ్‌.. ఇక మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాత‌రే!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `ఆచార్య‌`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటెర్టైన్మెట్స్ బ్యాన‌ర్లపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి క‌లిసి నిర్మించారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించ‌గా.. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ధ‌ర్మ‌స్థలి అనే ప్రాంతం చుట్టూ ఈ సినిమా మొత్తం న‌డుస్తుంది. ధ‌ర్మ‌స్థ‌లి ప్రాంతంలో ఉండే ఆల‌యం, దాని చుట్టూ ఉండే భూములను అన్యాయంగా క‌బ్జా చేయాల‌ని కొంద‌రు నీచులు ప్ర‌య‌త్నాలు చేస్తారు. వారి నుంచి ఆ ప్రాంతాన్ని, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను సిద్ధ‌, ఆచార్య‌లు ఎలా కాపాడు అన్న‌దే ఈ సినిమా క‌థ అని తెలుస్తోంది.

ఇందులో ఆచార్య‌గా చిరంజీవి, సిద్ధ‌గా చ‌ర‌ణ్‌లు క‌నిపించ‌బోతున్నారు. గ‌త ఏడాది చివ‌ర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమా ర‌న్ టైమ్‌ను లాక్ చేశార‌ట‌. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. ఈ సినిమా 166 నిమిషాల నిడివికి కట్ చేశారట. అంటే సుమారు 2 గంటల 46వ్ నిమిషాల పాటు ఆచార్య సినిమా ఉంటుందట. ఇదే నిజ‌మైతే మెగా ఫ్యాన్స్‌కు మాస్ జాత‌ర ఖాయ‌మ‌ని అంటున్నారు.


Share

Related posts

BREAKING VIRAL VIDEO: విడాకుల తరవాత మొట్టమొదటి సారి సమంతతో బంధం గురించి స్పందించిన నాగ చైతన్య

somaraju sharma

Surya : సూర్య నిర్మాతగా కీర్తి సురేష్ మూవీ..హీరో మాత్రం చాలా చిన్నోడు

GRK

Salaar: ‘సలార్‌’లో మరో బాలీవుడ్ బ్యూటీ..!

GRK