Acharya: “ఆచార్య” బ్యాలెన్స్ షూటింగ్ ఇంకా ఎన్నిరోజులు ఉందో తెలుసా..??

Share

Acharya: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు అందరికంటే మంచి జోరు మీద వున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకపక్క కరోనా సేవలు చేస్తూనే మరోపక్క కెరీర్లో సినిమాలు స్పీడ్ పెంచుతున్నారు. అదేరీతిలో ఇండస్ట్రీ పెద్దగా లాక్ డౌన్ సమయం నుండి సినీ కార్మికులకు అనేక రీతులుగా సహాయం అందిస్తున్న చిరంజీవి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడుతున్న రోగులు ఆక్సిజన్ సిలిండర్లు లేక అనేక అవస్థలు పడుతూ ఉండటంతో .. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి తన వంతుగా ఆదుకుంటూ ఉన్నారు.

Sankranti Race: Aacharya Replacing RRR!

ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2019 చివరిలో స్టార్ట్ అవ్వగా అనేక బ్రేకులు పడుతూ వచ్చింది. మధ్యలో మహామారి రావడంతో అన్ని సినిమాలతో పాటు అనేక కష్టాలను ఎదుర్కొన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… “ఆచార్య” సినిమాకి సంబంధించి 20 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని స్పష్టం చేశారు.

Read More: Acharya: మెగాస్టార్ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ అప్ డేట్..!!

అది కూడా సినిమాలో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే అని చెప్పటంతో మెగా అభిమానులు ఆచార్య ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయారు. మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా చాలా ఉన్నట్లు ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవుతున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా కొరటాల శివ 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పటంతో… మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. దీన్నిబట్టి ఇ బయట పరిస్థితులు అంతా సద్దుమణిగాక సినిమా రిలీజ్ అవడం గ్యారెంటీ అని అభిమానుల డిసైడ్ అయిపోయారు.


Share

Related posts

Fast Tag : ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి.. అది లేకపోతే భారీ ఫైన్..!

bharani jella

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్స‌ర్ గా డ్రీమ్ 11..!

Srikanth A

Swasika VJ Latest photos

Gallery Desk