Acharya: ఆచార్య సినిమా గురించి మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఎప్పటి నుంచో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. మెగా తండ్రీ – కొడుకులను సిల్వ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు.

ఎట్టకేలకు ఈ నెల 29వ తేదీనా ఆ కోరిక తీరబోతోంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుం డటంతో ఆచార్య చిత్రబృందం వరుసబెట్టి అప్‌డేట్స్‌ను వదులుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి లాహే లాహే సాంగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తుంటే గతంలో చిరంజీవి హీరోగా, సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించిన ఇంద్ర సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో భం భం భోలే శంఖం ఊదిలే అంటూ చిరు వేసిన మాస్ స్టెప్స్ ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి.
Acharya: చిరుతో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్, సంగీత అలరించనున్నారు.
ఇప్పుడు వచ్చిన లాహే లాహే కూడా అదే తరహాలో తెరకెక్కించారు. ఇక ఆచార్య సినిమాలో లాహే లాహే సాంగ్‌తో మరోసారి మెగాస్టార్ తన గ్రేస్ పర్ఫార్మెన్స్‌తో అలరించ బోతున్నారని క్లారిటీ వచ్చేసింది. సంగీత చాలా కాలం తర్వాత ఆచార్య సినిమాలో సందడిచేయబోతోంది. ఇక లాహే లాహే సాంగ్‌లో చిరుతో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్, సంగీత అలరించనున్నారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ ..అది కూడా మెగాస్టార్ సినిమాకూ అంటే ఈ రేంజ్ పాట ఒకటి పడాల్సిందే అని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు.