న్యూస్ సినిమా

“ఆచార్య” టీజర్ రిలీజ్ డేట్..??

Share

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా “ఆచార్య” అని అందరికీ తెలుసు. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాత రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అరగంట పాత్ర కూడా చేస్తున్నారు. వరుస విజయాల మీద ఉన్న కొరటాల శివ.. చాలా టైమ్ తీసుకుని “ఆచార్య” చేస్తున్న నేపథ్యంలో.. గ్యారెంటీగా హిట్ అని డిసైడ్ అయిపోయారు మెగా అభిమానులు.

Acharya's first look: Chiranjeevi is back with a massy avatar | Entertainment News,The Indian Expressఇదిలావుంటే ఇటీవల కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమాకి సంబంధించి షూటింగ్.. మొదలు కావడంతో మంచి స్పీడ్ మీద బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల. ఈ క్రమంలో నిర్మాత రామ్ చరణ్ కూడా సినిమా కోసం రాత్రి పగలు బాగా కష్టపడుతున్నటు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మరొక పక్క ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మొదటిలో న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ అవుతుందని అనుకొన్న రిలీజ్ కాలేదు.

 

ఆ తర్వాత సంక్రాంతి పండుగ వచ్చినా గానీ “ఆచార్య” టీజర్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ “వకీల్ సాబ్” టీజర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవం నాడు “ఆచార్య” టీజర్ రిలీజ్ చేసే ఆలోచన సినిమా యూనిట్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్. జనవరి 26 వ తారీఖు ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేయాలి అని కొరటాల ఫిక్స్ అయినట్లు సమాచారం. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో.. అదే ఫీల్.. ముందునుంచి ఉంచాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు, అందుకే రిపబ్లిక్ డే నాడు “ఆచార్య” టీజర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్.  


Share

Related posts

స్టార్ హీరోకు అనసూయ షాకింగ్ రిప్లై..! నేను రోజూ ఇలాంటి వేధింపులే ఎదురుకుంటున్నాను

arun kanna

గ్రేటర్ లో గులాబీ పార్టీ కి…MIM తో పొత్తు తప్పదా ?

sekhar

Ravi Teja: ఇలియానాకి బిగ్ హెల్ప్ చేసిన రవితేజ..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar