న్యూస్ సినిమా

Acharya: థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది..మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. గత ఏడాదే రావాల్సిన ఆచార్య సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ నెల 29న రాబోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా చూడని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇందిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. మొత్తంగా మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పడు విడుదలవుతుందా? అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

acharya theatrical trailer released
acharya theatrical trailer released

కాగా, భారీ స్థాయిలో ఆచార్య సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర థియేట్రికల్ రిలీజ్ అయింది. సాయంత్రం మెగాస్టార్ నటించిన 152వ సినిమా కావడంతో 152 థియేటర్స్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాస్త ఆగి సోషల్ మీడియాలో కూడా వదిలారు. ధర్మస్థలిలో చరణ్ చేసే పోరాట ఘట్టాలతో ట్రైలర్ మొదలై పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఆసక్తిని రేపింది. ఇక చిరు ఎంట్రీతో ఆ ఆసక్తి మరో రేంజ్‌కు వెళ్ళింది. ఒకే ఫ్రేంలో చిరు చరణ్‌లను చూస్తుంటే థియేటర్స్‌కు ఎప్పుడెప్పుడు పరుగులు పెడదామా అని ప్రతీ ఒక్కరిలో ఆరాటం మొదలైంది.

Acharya: మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌ల మాసివ్ పర్ఫార్మెన్స్‌

కొరటాల శివ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌ల మాసివ్ పర్ఫార్మెన్స్‌ తో ఆచార్య బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని అభిమానే కాదు..ఇండస్ట్రీ వర్గాలలో ట్రేడ్ అనలిస్టులలో భారీ స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే చరణ్  ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్, ఫ్లో ఇప్పుడు ఆచార్య సినిమాకు కంటిన్యూ కానుంది. ఇక గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌తో ఆచార్య సినిమా రేంజ్ ఇంకాస్త పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇక తాజా ట్రైలర్‌కు మణిశర్మ సంగీతం మరో లెవల్‌లో ఉంది.


Share

Related posts

Pawan Kalyan: ఆ డైరెక్టర్ల నిరీక్షణ ఫలించేనా? వారికి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడు కదా!

Ram

Journalist Raghu Case: జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కేసు : ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్టర్ కే‌సి‌ఆర్ ??

somaraju sharma

నెట్‌ఫ్లిక్స్‌కు క్వీన్ దొరికింది!

Siva Prasad