NewsOrbit
న్యూస్ సినిమా

జయ ప్రకాష్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు..!!

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల నుండి యువ హీరోల వరకూ చాలా మందితో కలిసి నటించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది. నేటి వేకువ జామున ఆయన గుంటూరులో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జయప్రకాష్ రెడ్డి గురించి పలు ఆశక్తి కరమైన విషయాలు “న్యూస్ ఆర్బిట్” ప్రేక్షకుల కోసం..

jayaprakash reddy

జయప్రకాష్ రెడ్డి తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పోలీస్ శాఖలో పని చేశారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో గల ప్రాధమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి అయిదవ తరగతి ఆ  తరువాత నెల్లూరులోని రంగనాయకులపేట ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి వరకూ చదివారు జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి పదవ తరగతిలో ఉండగా తండ్రి సాంబిరెడ్డి అనంతపురం బదిలీ అయ్యారు. అనంతపరంలోని సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఎస్ఎస్ఎల్‌సిలో చేరారు. జయప్రకాష్ రెడ్డికి చిన్ననాటి నుండి నాటకాలంటే ఆసక్తి, ఆయన తండ్రి సాంబిరెడ్డి కూడా నటుడే కావడంతో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి కూడా నాటకాల్లో నటించారని చెబుతుంటారు. ఒక పక్క నాటకాలపై ఆశక్తి కొనసాగిస్తూనే చదువులోనే రాణించి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి అయిన తరువాత గణిత ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరారు.

గప్‌చుప్ నాటకంతో టర్నింగ్

జయప్రకాష్ రెడ్డి నల్లగొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అతని నటనను మెచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. దానితో జయప్రకాష్ రెడ్డి 1988లో విడుదల అయిన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వార  తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రంలో ప్రతినాయకుడుగా చేసిన పాత్ర జయప్రకాష్ రెడ్డికి మంచి పేరు తీసుకువచ్చింది. తదుపరి నందమూరి బాలకృష్ణ హీరోగా విడుదలైన సమరసింహరెడ్డి, నరసింహానాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో తన దైన నటనా కౌలిల్యంతో ప్రేక్షకులను రంజిపజేశారు. రాయలసీమ మాండలికంలో జయప్రకాష్ రెడ్డి మాట్లాడే మాటలు, డైలాగ్ ప్రేక్షకులను ఆమితంగా ఆకట్టుకునేవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు పోషించి తనదైన ముద్రను చాటుకున్న జయప్రకాష్ రెడ్డి భౌతికంగా ఇక లేరు.  ‌

 

author avatar
Special Bureau

Related posts

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju