NewsOrbit
Entertainment News సినిమా

Devi Sriprasad: దేవిశ్రీప్రసాద్ పై పోలీస్ కంప్లైంట్ చేసిన నటి..!!

Share

Devi Sriprasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందరికీ సుపరిచితుడే. ఎక్కువ వివాదాలకు కూడా ఎప్పుడు వెళ్లడు. అటువంటి డిఎస్పి పై నటి కరాటే కళ్యాణి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. హిందూ దేవుళ్లను కించపరిచారని కంప్లైంట్ లో పేర్కొంది. విషయంలోకి వెళ్తే రీసెంట్ గా దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో ఐటమ్ సాంగ్ లో హరే రామ.. హరే కృష్ణ మంత్రాన్ని వాడారట. ఐటెం సాంగ్ లో ఈ రీతిగా మంత్రాన్ని ఎలా వాడుతారు అని కరాటే కళ్యాణి తో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం మీడియాతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ… అశ్లీల దుస్తులలో నృత్యాలు చేస్తూ పవిత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రం పాట చిత్రికరించడం తప్పు అని అంది.

Karate Kalyani Devisri Prasad: సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై  సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు.. - karate kalyani complaints on music director  devisri prasad details, karate kalyani , music ...

ఈ రీతిగా హిందూ మనోభావాలను దెబ్బతీసిన దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు పాటలో ఆ మంత్రాన్ని తొలగించాలని కూడా పేర్కొంది. లేకపోతే దేవి శ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని చుట్టుముట్టాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది. మరి దేవిశ్రీప్రసాద్… ఈ వివాదంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Case Filed on Devi sri prasad for o pari song karatae kalyani files  complaint on Devi sri prasad| ఎరక్కపోయి ఇరుకున్న దేవి శ్రీ ప్రసాద్.. బూతు  సాంగ్లో పవిత్ర మంత్రం.. కరాటే కళ్యాణి ...

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్… ప్రస్తుత “పుష్ప 2″కి సంబంధించి ఆటలను కంపోజ్ చేసే పనిలో ఉన్నారు. పుష్ప మొదటి భాగం సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ కావడంతో…సెకండ్ పార్ట్ సాంగ్స్ కోసం చాలా టైం తీసుకుని అద్భుతమైన లిరిక్స్ తో పాటు బాణీలు అందించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి క్రమంలో కరాటే కళ్యాణి కంప్లైంట్ పై దేవి శ్రీ ప్రసాద్ ఏవిధంగా స్పందిస్తారనది చూడాలి.


Share

Related posts

Anjana Rangan Latest Wallpapers

Gallery Desk

Meera Jasmine: మీరా జాస్మిన్ రీఎంట్రీ.. ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?

kavya N

Mahesh Babu: మహేష్ బాబు తో మరోసారి నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ భామ..!!

sekhar