మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” అనే సినిమా చేస్తున్నారు. మలయాళం లో మోహన్ లాల్ హీరోగా తేరకెక్కిన “లూసీఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సల్మాన్ ఖాన్ ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా నటించడం జరిగింది. సినిమాలో ఓ పెద్ద మాఫియా గ్యాంగ్ స్టార్ గా సల్మాన్ కనిపిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో జరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి ఓ పొలిటికల్ పార్టీకి లీడర్. ఇదే సినిమాలో చిరంజీవి పక్కనే చాలా సంవత్సరాల తర్వాత లాంగ్ లెన్త్ రోల్ కమెడియన్ సునీల్ చేయడం విశేషం. ఇంకా హీరోయిన్ నయనతార కూడా నటిస్తోంది.
మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఫైనల్ అండ్ లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్..!!
ఇదిలా ఉంటే ఇటీవల సీనియర్ యాక్టర్ మురళీమోహన్ తాను కూడా చిరంజీవి నటిస్తున్న “గాడ్ ఫాదర్” సినిమాలో కీలక పాత్ర చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయితే తనకి ఈ వేషం చిరంజీవి వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. గాడ్ ఫాదర్ స్టోరీ డిస్కషన్ జరుగుతున్న సమయంలో తాను చేయబోయే క్యారెక్టర్.. డైరెక్టర్ వివరిస్తుండగా దీనికి కరెక్ట్ గా మురళీమోహన్ సరిపోతారని చెప్పినట్లు వెంటనే నాకు ఫోన్ చేసి ఫోటోలు పంపాలని చిరంజీవి పేర్కొన్నారు. తెల్ల గడ్డం మరియు తల జుట్టు ఉన్న ఫోటోలను పంపించాలని సూచించారు. ఎలాగో నాకు ఉండేది అటువంటి తరహా లుక్ కనుక ఫోటోలు పంపిస్తే వెంటనే.. డైరెక్టర్ ఓకే చేయడం జరిగింది.
అయితే చిరంజీవి సూచన మేరకు సినిమా కోసం మరింతగా తెల్ల గడ్డం ఇంకా జుట్టు పెంచడం జరిగిందని.. గాడ్ ఫాదర్ లో తన పాత్ర గురించి మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 4వ తారీఖు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పరవాలేదు అనిపించింది. “గాడ్ ఫాదర్” వచ్చే దసరా పండుగకు విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. ఆచార్య పరాజయం పాలు కావడంతో గాడ్ ఫాదర్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని అభిమానులు టెన్షన్ గా ఉన్నారు.