సినిమా

Nagababu: గర్ల్‌ఫ్రెండ్ ఉందా అని అడిగిన నెటిజ‌న్‌.. నాగ‌బాబు రిప్లై అదుర్స్‌!

Nagababu views on money in youtube video
Share

Nagababu: మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ‌బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సహాయ నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నాగ‌బాబు.. హీరోగానూ ప‌లు చిత్రాలు చేశారు. అలాగే నిర్మాత‌గా ఎన్నో సినిమాలను నిర్మించారు. నటుడిగా, ప్రొడ్యూసర్‌గా ఎంతో అనుభవం ఉన్న ఆయనను `ఆరెంజ్` సినిమా ఆర్థికంగ బాగా దెబ్బ తీసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ కేటాయించి నాగ‌బాబు ఈ సినిమాను నిర్మించ‌గా.. 2010లో రిలీజ్ అయిన ఆరెంజ్ అట్టర్ ప్లాప్ కావడంతో ఆయ‌న‌ అప్పులపాలయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మాత మ‌రే సినిమా నిర్మించ‌లేదు కానీ.. న‌టుడిగా, జ‌న‌సేన నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే నాగ‌బాబు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్ ముచ్చ‌ట్లు పెట్టింది.

ఈ చిట్ చాట్ సెష‌ల్‌లో నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు నాగ‌బాబు స‌మాధాలు ఇచ్చారు. అయితే ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ `మీకు ఇప్పుడు కానీ, గతంలో కానీ గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నారా?` అని ప్ర‌శ్నించాడు. అందుకు నాగ‌బాబు ఇచ్చిన రిప్లై అదుర్స్ అని చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే.. `హా ఉంది.. నా భార్య‌` అంటూ స‌మాధానం ఇచ్చారు.

అలాగే ఓ నెటిజ‌న్ `వ‌రున్ తేజ్ న‌టించిన గని చిత్రం ఎందుకు సరిగా ఆడలేదంటారు?` అని అడ‌గ‌గా.. అందుకు నాగ‌బాబు యాక్టింగ్‌ జర్నీలో హిట్స్‌. ఫ్లాప్స్‌ సహజమ‌ని రిప్లై ఇచ్చారు. ఈలోపు మ‌రో ఫాలోవ‌ర్ `సినిమాల్లో విలన్‌గా ట్రై చేయొచ్చు కదా సర్‌` అంటూ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌గా.. దానికి నాగ‌బాబు ఎరైనా అవకాశం ఇవ్వాలిగా అంటూ పేర్కొన్నాడు.

 


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ డేరింగ్ డైరెక్టర్ ఫిక్స్..?

GRK

Bollywood: ఆ ప్రముఖ హీరోయిన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది..!!

sekhar

‘RRR’: రోమాలు నిక్కబొడుచుకునే పాటొచ్చేసింది..ఇదొక్కటే చాలు..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar